అగ్రిగోల్డ్ కు చెందిన రూ. 4,109 విలువైన ఆస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక , ఒడిశాలలోని అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకొంది.
హైదరాబాద్: అగ్రిగోల్డ్ కు చెందిన రూ. 4,109 విలువైన ఆస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక , ఒడిశాలలోని అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకొంది.
ఏపీ రాష్ట్రంలో 56 ఎకరాల హాయ్ లాండ్ ఆస్తులు, పలు కంపెనీల్లో వాటాలు, యంత్రాలను ఈడీ అటాచ్ చేసింది. గురువారం నాడు అగ్రిగోల్డ్ ఛైర్మెన్ అవ్వా వెంకటరామారావు, డైరెక్టర్లు శేషు నారాయణరావు, హేమ సుందర వరప్రసాద్ ను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపర్చారు.
undefined
అగ్రిగోల్డ్ లో డిపాజిట్లు చేసిన వారికి కోర్టు ఆదేశాల మేరకు విడతల వారీగా డబ్బులు చెల్లిస్తున్నారు. అగ్రిగోల్డ్ స్కామ్ లో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది.160 షెల్ కంపెనీలతో మనీలాండరింగ్ కు పాల్పడినట్టుగా అగ్రిగోల్డ్ సంస్థ ఛైర్మెన్, డైరెక్టర్లపై ఆరోపణలున్నాయి. ఈ దిశగా ఈడీ దర్యాప్తు చేస్తోంది.
ఆరు రాష్ట్రాల్లోని 32 లక్షలమంది పెట్టుబడిదారుల నుండి 36,380 కోట్ల కుంభకోణానికి అగ్రిగోల్డ్ లో చోటు చేసుకొందని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. ఏపీ రాష్ట్రంలోని అనంతపురం, కర్నూల్, కృష్ణ, గుంటూరు, చిత్తూరు, కడప, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్టణం, నెల్లూరు. ప్రకాశం, శ్రీకాకుళం, కడప జిల్లాల్లోని అగ్రిగోల్డ్ ఆస్తులను ఈడీ జప్తు చేసింది.
ఇక కర్ణాటకలోని యాదగిర్, బెంగుళూరు, కోలార్, మాండ్యా జిల్లాల్లోని ఆస్తులను అటాచ్ చేసింది.
ఒడిశాలోని ఖుర్ధా, తమిళనాడులోని కృష్ణగిరి, తెలంగాణలోని మహబూబ్ నగర్, నారాయణపేట, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లోని ఆస్తులను ఈడీ జప్తు చేసింది.