పీఆర్సీతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యపై ఫోకస్ పెట్టింది జగన్ సర్కార్. ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ అదనపు కార్యదర్శి ఆదినారాయణను నోడల్ అధికారిగా ఏపీ సర్కార్ నియమించింది. ఉద్యోగుల సమస్యలపై చర్చించడానికి నోడల్ అధికారిని నియమిస్తున్నట్టుగా ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి: ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యపై ఫోకస్ పెట్టింది. పీఆర్సీ విషయమై ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు.దీంతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మరోవైపు ఉద్యోగుల సమస్యలపై సంప్రదింపులకు ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ అదనపు కార్యదర్శి ఆదినారాయణను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.2018 జూలై 03వ తేదీన పీఆర్సీ కోసం ఆశుతోష్ మిశ్రా కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆశుతోష్ మిశ్రా ప్రభుత్వానికి ఈ నివేదికను అందించారు.2020 అక్టోబర్ 5న అశుతోష్ మిశ్రా పీఆర్సీ నివేదికను ప్రభుత్వానికి అందించారు. అయితే ఈ నివేదికను ప్రభుత్వం ఇంకా ఉద్యోగ సంఘాలకు అందించలేదు. ఈ ఏడాది అక్టోబర్ 29న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో Prc నివేదిక ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు పట్టుబట్టారు. అయితే వారంలో పీఆర్సీ నివేదికను విడుదల చేస్తామని సీఎస్ Sameer Sharma హమీ ఇచ్చారు. అయితే ఇంతవరకు పీఆర్సీ నివేదికను ఉద్యోగ సంఘాలకు అందించలేదు.ఈ నెల 10న సీఎంతో చర్చించిన తర్వాత పీఆర్సీ నివేదిక ఇస్తానని సీఎస్ చెప్పారు. అయితే బుధవారం నాడు కూడా పీఆర్సీ నివేదిక అందించలేదు. బుధవారం నాడు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సీఎస్ నుండి సమాచారం వస్తోందనే ఆశతో ఉద్యోగ సంఘాల నేతలు సచివాలయంలోనే ఎదురు చూశారు. ఇవాళ ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు Venkatram Reddy సీఎస్ సమీర్ శర్మతో భేటీ అయ్యారు. అయితే పీఆర్సీ నివేదికను అందించలేదని ఆయన ప్రకటించారు. ఈ నెల 12న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తామని సీఎస్ సమీర్ శర్మ తెలిపాడని వెంకట్రామిరెడ్డి తెలిపారు.
also read:పీఆర్సీ: రేపు ఉద్యోగులతో జగన్ సర్కార్ జాయింట్ కౌన్సిల్ సమావేశం
పీఆర్‌సీపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోందని అధికారులు చెబుతున్నారు. వారం రోజుల్లో ఈ అంశాన్ని సెటిల్ చేయాలని Employees Union నేతలు డిమాండ్ చేస్తున్నారు.ఉద్యోగులకు, రిటైర్డ్ సిబ్బందికి రావలసిన కోట్లాది రూపాయలు పెండింగ్ నిధుల విడుదలపై కార్యాచరణ ప్రకటించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. 2018 జూలై 1 నుంచి పీఆర్‌సీ సిఫారసులను అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ తేదీకి ఒక్క రోజు తక్కువైనా అంగీకరించమన్నారు. 60 పర్సంటేజీ ఫిట్‌మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్‌తో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు గురువారం నాడు భేటీ అయ్యారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు మాట్లాడారు. పీఆర్సీ నివేదికను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతోందని ప్రశ్నించారు.. పీఆర్సీ నివేదికను తామూ స్టడీ చేయాలన్నారు. తమ డిమాండ్లు నివేదికలో ఉన్నాయో, లేవో తమకు తెలియాలి కదా అని ఆయన ప్రశ్నించారు. ఎవరేం విమర్శలు చేసినా తాము పట్టించుకోమని అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు స్పష్టం చేశారు.