అర్ధరాత్రి వరకు వెయిట్ చేయిస్తారా... ఉద్యోగులంటే ఎందుకింత చిన్నచూపు: జగన్ సర్కార్‌పై నాదెండ్ల ఫైర్

Siva Kodati |  
Published : Nov 11, 2021, 04:57 PM IST
అర్ధరాత్రి వరకు వెయిట్ చేయిస్తారా... ఉద్యోగులంటే ఎందుకింత చిన్నచూపు: జగన్ సర్కార్‌పై నాదెండ్ల ఫైర్

సారాంశం

ఏపీలో పీఆర్సీ వ్యవహారం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. పీఆర్సీ నివేదికను విడుదల చేసే వరకు విడిచిపెట్టేది లేదని ఉద్యోగ సంఘాలు నేతలు (ap govt employees) ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉద్యోగ సంఘాల నేతలను ఏపీ ప్రభుత్వం అవమానించిందంటూ జనసేన (janasena party) రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (nadendla manohar) ధ్వజమెత్తారు. 

ఏపీలో పీఆర్సీ వ్యవహారం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. పీఆర్సీ నివేదికను విడుదల చేసే వరకు విడిచిపెట్టేది లేదని ఉద్యోగ సంఘాలు నేతలు (ap govt employees) ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు పలు పార్టీలు మద్ధతు ప్రకటిస్తున్నారు. తాజాగా ఉద్యోగ సంఘాల నేతలను ఏపీ ప్రభుత్వం అవమానించిందంటూ జనసేన (janasena party) రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (nadendla manohar) ధ్వజమెత్తారు. పీఆర్సీ నివేదిక కోరిన ఉద్యోగ సంఘాల నాయకులను అర్ధరాత్రి వరకు సచివాలయంలో పడిగాపులు పడేలా చేయడం వారిని కించపర్చడమేనని మనోహర్ ఎద్దేవా చేశారు. 

జగన్ ప్రభుత్వానికి ఉద్యోగులంటే ఎందుకింత చిన్నచూపు? అని నాదెండ్ల ప్రశ్నించారు. అసలు, పీఆర్సీ నివేదికను సీల్డ్ కవర్ లో ఎందుకు దాచిపెడుతున్నారు? అంటూ నిలదీశారు. ఈ మేరకు నాదెండ్ల మనోహర్ ట్వీట్ చేశారు. అంతేకాదు, సచివాలయంలో రాత్రివేళ పీఆర్సీ నివేదిక కోసం చూస్తున్న ఉద్యోగ సంఘాల నేతల ఫొటోను కూడా ట్వీట్‌కు జత చేశారు. 

Also Read:పీఆర్సీ: రేపు ఉద్యోగులతో జగన్ సర్కార్ జాయింట్ కౌన్సిల్ సమావేశం

అంతకుముందు పీఆర్సీపై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదని ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం (ap secretariat employees association) అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి (venkatrami reddy) గురువారం చెప్పారు. గత నెల 29న పీఆర్సీ రిపోర్టు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంకా నివేదిక ఇవ్వలేదన్నారు.ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి గురువారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడారు.  రేపు సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు. పీఆర్సీ రిపోర్టు ఇవ్వకుండా నివేదిక గురించి తాన మాట్లాడబోనని తెలిపారు. కొన్ని ఉద్యోగ సంఘాలు చేస్తున్న విమర్శలు బాధాకరమని ఆయన చెప్పారు. ఉనికి కోసమే కొన్ని ఉద్యోగ సంఘాలు విమర్శలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

Prcపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆశుతోష్ మిశ్రా (ashutosh mishra) కమిటీ ఏడాది క్రితమే నివేదికను ఇచ్చింది. పీఆర్సీ నివేదిక ఇంకా ఉద్యోగ సంఘాలకు చేరలేదు. ఉద్యోగుల ఫిట్‌మెంట్ పై కూడా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. గతంలో కూడా joint staff Council సమావేశం జరిగింది. ఈ సమావేశంతో పాటు పీఆర్సీ నివేదికపై సీఎస్ sameer sharma  సీఎం జగన్ తో చర్చించారు. అయితే ఈ నెల 12న జాయింట్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ప్రభుత్వం పీఆర్సీపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతిని 27 శాతంగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. అయితే ఈ విషయమై  ఐఆర్ 27 శాతానికి పరిమితం చేయడంపై ఉద్యోగ సంఘాలు అంగీకరించడానికి సిద్దంగా లేవు. వేతన ఫిట్ మెంట్ పై కూడా కనీసం 60 శాతంగా ఉండాలనే డిమాండ్ ఉద్యోగ సంఘాల నుండి నెలకొంది.
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్