బాబుకు షాక్: ఆడారి ఆనంద్ వైఎస్ఆర్‌సీలో చేరిక

Published : Sep 01, 2019, 11:15 AM ISTUpdated : Sep 01, 2019, 05:19 PM IST
బాబుకు షాక్: ఆడారి ఆనంద్ వైఎస్ఆర్‌సీలో చేరిక

సారాంశం

టీడీపీకి మరో షాక్ తగిలింది. విశాఖ జిల్లాకు చెందిన ఆడారి ఆనంద్ , రమాకుమారి టీడీపీకి గుడ్ బై చెప్పారు. వైఎస్ఆర్‌సీపీలో చేరారు. 

న్యూఢిల్లీ: విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ నేత ఆడారి ఆనంద్ ఆదివారం నాడు సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్‌సీపీలో చేరారు.విశాఖ డెయిరీ డైరెక్టర్లు 12 మంది కూడ వైసీపీలో చేరారు.

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుండి ఆడారి ఆనంద్ కుమార్ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఎలమంచిలి మున్సిపల్ ఛైర్మెన్  రమాకుమారి ఉన్నారు.

ఆడారి ఆనంద్ తో పాటు విశాఖ డైరీకి చెందిన  12 మంది డైరెక్టర్లు కూడ వైఎస్ఆర్‌సీపీ  తీర్థంపుచ్చుకొన్నారు. ఆడారి ఆనంద్ తండ్రి ఆడారి తులసీరావుకు ఈ ప్రాంతంలో మంచి  పట్టుంది. 

ఆనందరావు తండ్రి తులసీరావు మాత్రం టీడీపీలోనే కొనసాగుతానని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుకు ఇటీవల చెప్పారు. అయితే ఆదివారం నాడు జరిగిన వైసీపీలో చేరే కార్యక్రమంలో అనారోగ్యంతోనే తులసీరావు రాలేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!