
అమరావతి : మంత్రి రోజాపై నటుడు పృథ్వి ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో మొదట ఓడిపోయేది నగరి స్థానమే అన్నారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడం, రెండుసార్లు ఓడిపోవడం వల్ల ఏమైనా నష్టం ఉందా అని ప్రశ్నించారు. తన దగ్గర ఓ బ్రౌన్ కలర్ డైరీ ఉందని.. అందులో ఏ ఎమ్మెల్యే ఎంతెంత సంపాదించారో నోట్ చేశానని చెప్పుకొచ్చారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన కూటమికి 136 స్థానాలు వస్తాయని జోస్యం చెప్పారు. 21 పార్లమెంట్ స్థానాలు కూటమి గెలుచుకుంటుందని తెలిపారు. ఇప్పుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యలు ఏపీ లో చర్చనీయాంశంగా మారాయి.