రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అన్న పృథ్వీ సిగ్గుపడాలన్నారు. ఎవరు పెయిడ్ ఆర్టిస్టులు? అమరావతి ఆడపడుచులా? అమరావతిలో ఉన్న కమ్మ వాళ్లా? అని పోసాని ప్రశ్నల వర్షం కురిపించారు. ఆడపడుచులకు పృథ్వీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజధాని రైతులపై ఎస్వీబీసీ చైర్మన్, సినీ నటుడు పృథ్వీరాజ్ వ్యాఖ్యలకు నటుడు పోసాని కృష్ణ మురళి మండిపడ్డారు. రాజధాని కోసం ఆందోళనలు చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అనడంపై పోసాని కాస్త ఘాటుగానే స్పందించాడు. రాజధాని రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అనడం ఘోరమన్నారు. 3 పంటలు పండే భూముల్ని రాజధాని కోసం వదులుకున్నారని, రైతులు చొక్కా, ప్యాంట్లు వేసుకోకూడదా? అని పోసాని ప్రశ్నించారు.
రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అన్న పృథ్వీ సిగ్గుపడాలన్నారు. ఎవరు పెయిడ్ ఆర్టిస్టులు? అమరావతి ఆడపడుచులా? అమరావతిలో ఉన్న కమ్మ వాళ్లా? అని పోసాని ప్రశ్నల వర్షం కురిపించారు. ఆడపడుచులకు పృథ్వీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
undefined
ఐదేళ్ల ప్రభుత్వాన్ని 6 నెలలు కాకుండానే భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్‌ను అన్‌పాపులర్ చేయడానికి పృథ్వీ ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్‌మోహన్‌రెడ్డి గాడు అని ఆడవాళ్లు తిడుతున్నారంటే.. అది పృథ్వీలాంటి వాళ్ల వల్లేనని చెప్పారు.తప్పు చేస్తే జగనైనా తాను వదలనని పోసాని పేర్కోనడం గమనార్హం.
AlsoRead మధ్యాహ్న భోజన పథకంలో జగన్ మార్క్: నోరూరిస్తున్న కొత్త మెనూ...
పృథ్వీ ఎవరి తరపున మాట్లాడారో చెప్పాలని పోసాని నిలదీశారు. పృథ్వీ వ్యాఖ్యలను మంత్రులు సమర్థిస్తే ఇక తాను మాట్లాడనని, తన దారి తాను చూసుకుంటానని పేర్కొన్నారు. పృథ్వీలాంటి సినిమా వాళ్లు మూడు, నాలుగేళ్లలో వచ్చి చేరారని చెప్పారు. తనతో పాటు ఎమ్మెల్యే రోజా పదేళ్ల నుంచి ఉన్నామని చెప్పుకొచ్చారు.
రైతులంటే అడుక్కుతినే వాళ్లే ఉంటారా? ఆత్మాభిమానం ఉన్న రైతుల్ని అవమానిస్తారా అని మరోసారి ప్రశ్నించారు. 30 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు ఎంత ఆవేదన ఉంటుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు జగన్ అంటే ద్వేషమని పోసాని కృష్ణ మురళి దుయ్యబట్టారు.