ముద్రగడకు అందని ఆహ్వానం.. మోహన్ బాబు ఫైర్

Published : Jan 28, 2019, 11:40 AM IST
ముద్రగడకు అందని ఆహ్వానం.. మోహన్ బాబు ఫైర్

సారాంశం

ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణకు ముద్రగడ పద్మనాభాన్ని ఆహ్వానించకపోవడం పట్ల సినీ నటుడు మోహన్ బాబు మండిపడ్డారు. 

ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణకు ముద్రగడ పద్మనాభాన్ని ఆహ్వానించకపోవడం పట్ల సినీ నటుడు మోహన్ బాబు మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా పాలకొల్లులో శనివారం మోహనబాబు చేతుల మీదుగా దాసరి నారాయణరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు.

కాగా.. అక్కడే బస చేసిన మోహన్ బాబుని ఆదివారం ముద్రగడ పాలకొల్లులో కలిశారు. విగ్రహావిష్కరణకు ఎందుకు రాలేదని ఈ సందర్భంగా మోహన్ బాబు.. ముద్రగడని ప్రశ్నించగా.. తనకు ఆహ్వానం అందలేదని చెప్పారు. దీనిపై మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ముద్రగడను కూడా ఆహ్వానించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.

దాసరి తనకు గురువు అయితే.. ముద్రగడకు సన్నిహితులని ఈ సందర్భంగా మోహన్ బాబు పేర్కొన్నారు. కాగా.. వీరిద్దరి భేటీ రాజకీయంగా చర్చనీయాంశమైంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే