నెల్లూరు జిల్లాలో దారుణం: మైనర్ బాలిక గొంతు కోసి యాసిడ్ దాడి, బాలిక పరిస్థితి విషమం

Published : Sep 05, 2022, 09:51 PM ISTUpdated : Sep 05, 2022, 10:23 PM IST
 నెల్లూరు జిల్లాలో దారుణం: మైనర్ బాలిక గొంతు కోసి యాసిడ్ దాడి, బాలిక పరిస్థితి విషమం

సారాంశం

నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలం నక్కలకాలలనీలో బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు దుండగుడు. బాలిక ప్రతిఘటించడంతో  ఆమె గొంతు కోశాడు. అంతేకాదు యాసిడ్ దాడి చేశాడు. 

నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలం నక్కలకాలనీలో బాలిక గొంతు కోసి యాసిడ్ పోశాడు దుండగుడు.  బాలిక పరిస్థితి విషమంగా ఉంది. నెల్లూరు జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.  బాలికపై  అత్యాచారయత్నం చేయడంతో బాలిక ప్రతిఘటించింది.

దీంతో  దుండగుడు బాలిక గొంతు కోసి ఆ తర్వాత యాసిడ్ పోశాడని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఏబీఎన్ కథనం ప్రసారం చేసింది. అయితే  విద్యార్ధినిపై  యాసిడ్ పోసి  గొంతు కోయడానికి కారణాలు తెలియాల్సి ఉందని మరో తెలుగు న్యూస్ చానెల్  టీవీ 9 కథనం ప్రసారం చేసింది. బాలిక గొంతు కోసిన ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది.  ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్