మన్నం ప్రసాద్ హత్య కేసులో పురోగతి.. నిందితుడు శేషన్న విచారణకు తరలింపు...

By SumaBala BukkaFirst Published Dec 2, 2022, 12:24 PM IST
Highlights

పదిహేడేళ్ల క్రితం ప్రకాశం జిల్లా సింగరాయకొండలో జరిగిన మన్నం ప్రసాద్ హత్య కేసులో విచారణకు.. నయీం గ్యాంగులో కీలకంగా ఉన్న శేషన్నను పోలీసులు తీసుకువచ్చారు. 

ఒంగోలు : 17 ఏళ్ల క్రితం జరిగిన ఓ హత్యకేసులో నయీం ముఠాకు చెందిన శేషన్న అలియాస్ శేషయ్యను ఒంగోలు పోలీసులు విచారణకు తీసుకువచ్చారు. ప్రకాశం జిల్లా  సింగరాయకొండలో మన్నం దేవీప్రసాద్ అలియాస్ మన్నం ప్రసాద్ హత్య జరిగింది. ఈ ఘటన జరిగి పదిహేడేళ్లు అవుతుంది. ఈ హత్య కేసులో నిందితుడిగా  ఉన్న నయిమ్ ముఠాకు చెందిన శేషన్నను విచారణ నిమిత్తం పోలీసులు ఒంగోలుకు తరలించారు. ఈ నిందితుడు అనధికారికంగా తన వద్ద ఆయుధాలను ఉంచుకున్నాడు అని.. సమాచారంతోగో ల్కొండ పోలీస్ స్టేషన్ లో రెండు నెలల క్రితం కేసు నమోదయింది.

ఈ మేరకు గోల్కొండ పోలీసులు శేషన్నను అరెస్టు చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. శేషన్న విచారణలో 2005లో సింగరాయకొండలో జరిగిన బ్యాంకు ఉద్యోగి దేవీప్రసాద్ హత్య కేసులో అతనికి ప్రమేయం ఉన్నట్లుగా తెలిసింది. దీంతో ఒంగోలు పోలీసులు కోర్టు అనుమతితో శేషన్నను జైలు నుంచి సింగరాయకొండకు తరలించారు. ఈ కేసు నేపథ్యంలో శేషన్నను మూడు రోజుల పాటు పోలీసులు విచారించనున్నారు. 

ఆ శృంగార వీడియో వ్యాప్తిని తక్షణమే అడ్డుకోండి.. ఆదేశించిన హైకోర్టు.. ఇంతకీ ఆ వీడియోలో ఉన్నది ఎవరంటే...

అప్పుడు ఏం జరిగిందంటే.
అప్పట్లో బ్యాంకు ఉద్యోగి మన్నం దేవీప్రసాద్ హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ సమయంలో పీపుల్స్వార్ ఉద్యమం బలంగా ఉంది. ఆ రోజుల్లోనే నల్లమల నల్లత్రాచుల పేరుతో కొంతమంది ఈ ఘాతుకానికి  పాల్పడ్డారు. సింగరాయకొండలోని పిడిసిసి బ్యాంకులో పెయిడ్ కార్యదర్శిగా దేవీప్రసాద్ విధులు నిర్వహిస్తున్నాడు. 2005 సెప్టెంబర్ 10న బ్యాంకు దగ్గరే.. మన్నం ప్రసాద్ ను అతి కిరాతకంగా.. గొడ్డళ్లతో నరికి చంపారు. ఆ తర్వాత ప్రసాద్ మృతదేహం వద్ద మావోయిస్టులకు సహకరిస్తున్నందుకే ఇలా చంపమని లెటర్ వదిలి వెళ్లారు. 

ఆ సమయంలో ఈ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నల్లత్రాచు మీద అధికారులు కేసు దర్యాప్తు చేపట్టినా.. ఎవరో తేల్చలేక పోయారు. అయితే , 17 ఏళ్ల తర్వాత ఈ హత్యకు పాల్పడింది నయీం ముఠా అని వెలుగు చూసింది. పోలీస్ ఇన్ ఫార్మర్ గా వ్యవహరించిన నయీం తర్వాతికాలంలో గ్యాంగ్ స్టర్ గా ఎదిగాడు. పోలీసులకే సవాలుగా మారాడు. తెలంగాణ ప్రభుత్వం ఆ తరువాతి కాలంలో నయీంను ఎన్కౌంటర్ లో మట్టు పెట్టింది.

తెలంగాణలో నయీమ్ ముఠా చేసిన అకృత్యాలు, అరాచకాలపై విచారణ  చేపట్టారు. నయీమ్ ముఠాలో శేషన్నకీలకంగా ఉండేవాడు. అతడిని అదుపులోకి తీసుకున్న తర్వాత మన్నం ప్రసాద్ హత్య విషయం కూడా వెలుగు చూసింది. ఈ హత్య కేసులో నేరుగా పాల్గొన్న నిందితుల్లో ఒకరైన కె. విజయ్ కుమార్ ఇప్పటికే మృతి చెందినట్లు  తెలిసింది. కుంట్లా సత్యనారాయణ, కుంట్లా యాదగిరిలు శేషన్న సహ నిందితులుగా ఉన్నారు. వీరిద్దరి ఆచూకీ ఇంకా తెలియలేదు. 17 ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసులో మరిన్ని వివరాలు శేషన్న నోరు విప్పితే బయట పడే అవకాశాలు ఉన్నాయి. 

click me!