తిరుపతి జిల్లాలో పరువు హత్య?.. ఇంటర్ విద్యార్థిని మృతి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు!

Published : Dec 02, 2022, 12:04 PM IST
తిరుపతి జిల్లాలో పరువు హత్య?.. ఇంటర్ విద్యార్థిని మృతి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు!

సారాంశం

తిరుపతి జిల్లా చంద్రగిరిలోని రెడ్డివారిపల్లెలో ఇంటర్ విద్యార్థిని మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొద్ది నెలల మృతిచెందిన మోహనకృష్ణ ఆత్మహత్య చేసుకోలేదని.. ఆమెది పరువు హత్య అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

తిరుపతి జిల్లా చంద్రగిరిలోని రెడ్డివారిపల్లెలో ఇంటర్ విద్యార్థిని మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొద్ది నెలల మృతిచెందిన మోహనకృష్ణ ఆత్మహత్య చేసుకోలేదని.. ఆమెది పరువు హత్య అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోస్టుమార్టమ్ రిపోర్ట్‌లో ఆమెది ఆత్మహత్య కాదని.. హత్య అని నిర్దారించినట్టుగా తెలుస్తోంది. అయితే యువతి మృతిచెందిన తర్వాత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. దీంతో ప్రేమ విఫలం కావడంతోనే యువతిఆత్మహత్య చేసుకుని ఉంటుందని అంతా భావించారు.  

అయితే తాజాగా యువతి పోస్టుమార్టమ్ రిపోర్ట్‌లో ఆమెది హత్యగా నిర్దారణ అయింది. దీంతో ఈ కేసుకు సంబంధించి చంద్రగిరి పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు   కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఆత్మహత్య అని ఎందుకు తప్పుడు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది?.. అసలు ఆ యువతిని ఎవరూ హత్య చేశారనే విషయాలను ఆరా తీసే పనిలో పడ్డారు. 

అయితే మరణించిన యువతి ఓ వ్యక్తిని ప్రేమించినట్టుగా తెలుస్తోంది. అయితే కులాలు వేరు కావడంతో అతడితో పెళ్లికి ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెను కుటుంబ సభ్యులే ఆమె హత్య చేసినట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

YS Jagan On Seediri Appalraju Son Issue | YS Jagan Press Meet | Asianet News Telugu
బాబు పాలనలో గంజాయికి గిట్టుబాటు ధర బాగుంది: YS Jagan | Asianet News Telugu