మొహర్రం వేడుకల్లో అపశృతి: పిట్టగోడ కూలి 20 మందికి గాయాలు

By Siva KodatiFirst Published Sep 10, 2019, 10:07 AM IST
Highlights

కర్నూలు జిల్లాలో మొహర్రం వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. బి.తాండ్రపాడులో పీర్ల చావిడి దగ్గర పిట్ట గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో 20 మందికి పైగా గాయపడగా.. వీరిలో పలువురి పరిస్ధితి విషమంగా ఉంది.

కర్నూలు జిల్లాలో మొహర్రం వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. బి.తాండ్రపాడులో పీర్ల చావిడి దగ్గర పిట్ట గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో 20 మందికి పైగా గాయపడగా.. వీరిలో పలువురి పరిస్ధితి విషమంగా ఉంది.

నిప్పుల గుండాన్ని తొక్కుతున్న దృశ్యం చూసేందుకు భారీ సంఖ్యలో జనం పక్కనే ఉన్న ఇంటి మేడపై ఉన్న పిట్టగోడ మీద గుమిగూడారు. పిట్టగోడ చిన్నది కావడంతో ఒక్కసారిగా కూలిపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

హసన్, హుస్సేన్ అనే ముస్లిం వీరుల జ్ఞాపకార్ధం ముస్లిం సోదరులు మొహర్రం జరుపుకుంటారు. ముస్లిం పంచాంగం ప్రకారం అరేబియాలో సంవత్సరం యొక్క మొదటి నెల మొహరం. ఈ సందర్భంగా యుద్ధంలో చనిపోయిన వీరులకు ప్రతీకగా చేయి ఆకారంలో రూపాలను తయారు చేసి వాటిని అలంకరించి ఊరేగిస్తారు వీటినే పీర్లు అని పిలుస్తారు. 

"

click me!