బయటివారికి శ్రీవారి దర్శనాలు: ఎమ్మెల్సీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన టీటీడీ

By Siva KodatiFirst Published Sep 10, 2019, 9:26 AM IST
Highlights

తిరుమలలో దళారులకు చెక్ పెట్టేందుకు టీటీడీ రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా ఓ ఎమ్మెల్సీతో పాటు చెన్నైకి చెందిన ఓ మాజీ సలహామండలి సభ్యుడిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. ప్రోటోకాల్ దర్శనాలను వీరు దుర్వినియోగం చేస్తున్నట్లుగా టీటీడీ అంతర్గత విచారణలో బయటపడింది. దీంతో వీరి పేర్లను బ్లాక్ లిస్ట్‌లోకి చేర్చింది

తిరుమలలో దళారులకు చెక్ పెట్టేందుకు టీటీడీ రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా ఓ ఎమ్మెల్సీతో పాటు చెన్నైకి చెందిన ఓ మాజీ సలహామండలి సభ్యుడిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. ప్రోటోకాల్ దర్శనాలను వీరు దుర్వినియోగం చేస్తున్నట్లుగా టీటీడీ అంతర్గత విచారణలో బయటపడింది. దీంతో వీరి పేర్లను బ్లాక్ లిస్ట్‌లోకి చేర్చింది.

కుటుంబసభ్యుల పేరుతో ఇతరులకు దర్శనాలు కల్పించారని టీటీడీ అధికారులు గుర్తించారు. ఇకపై వారికి ప్రోటోకాల్ దర్శన టికెట్లను జారీ చేసేటప్పుడు సదరు వీఐపీల కుటుంబ సభ్యులా కాదా అనే వివరాలు ముందుగా సమర్పించాలని నిబంధనలు విధించారు.

అలాగే తన కార్యాలయంలో జారీ చేసే టికెట్లను సైతం పరిశీలించాలంటూ విజిలెన్స్ అధికారులకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు 65 మంది దళారీలు.. పీఆర్వోల ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచారు. 

click me!