అచ్చెన్నాయుడి నోటి దురుసు: దొబ్బిందా అని నిలదీయండి

By Nagaraju TFirst Published Jan 29, 2019, 5:50 PM IST
Highlights

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండల పర్యటనలో భాగంగా సంతమైదానంలో మంత్రి ఓటర్ ని ఎలా ఓట్లు అడగాలో ట్రైనింగ్ ఇచ్చారు కార్యకర్తలకు. ఏంరా వంద యూనిట్లు ఫ్రీగా తీసుకున్నావ్. మీ ఆవిడ రూ.10వేలు దొబ్బింది. రుణమాఫీ వస్తే దొబ్బారు. ఇవన్నీ దొబ్బి ..మనకు ఓట్లు వేయకపోతే నిలదీయండి అంటూ మంత్రి అచ్చెన్నాయుడు తమ అనుచరులకు స్పష్టం చేశారు. 

టెక్కలి : ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆయా పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. అధికార పార్టీ వృద్ధుల పింఛన్ రూ.2000కి పెంచడంతోపాటు డ్వాక్రా మహిళలకు రూ.10 వేలు, స్మార్ట్ ఫోన్ ఇస్తున్నట్లు ప్రకటించింది. 

అంతేకాదు కేంద్రం ప్రకటించిన 10శాతం ఈబీసీ రిజర్వేషన్లలో 5శాతం రిజర్వేషన్లను కాపులకు ఇస్తానని ప్రకటించేశారు చంద్రబాబు. ఇక ఇదిలా ఉంటే ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాలు అంటూ ఏడాది కాలంగా ప్రచారం చేసుకుంటుంది. 

అటు జనసేన పార్టీ సైతం 25 కేజీల బియ్యం కాదు 25 ఏళ్ల భవిష్యత్ ఇస్తానంటూ ప్రచారం చేసుకుంటుంది. వీళ్లందరి పాట్లు ఓట్లు కోసమే. ఓటర్ల మెప్పుపొందేందుకు ఆయా పార్టీలు తాయిలాలు ప్రకటిస్తే మంత్రి అచ్చెన్నాయుడు మాత్రం తన రూటే సెపరేట్ అంటూ కార్యకర్తలకు సూచించారు. 

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండల పర్యటనలో భాగంగా సంతమైదానంలో మంత్రి ఓటర్ ని ఎలా ఓట్లు అడగాలో ట్రైనింగ్ ఇచ్చారు కార్యకర్తలకు. ఏంరా వంద యూనిట్లు ఫ్రీగా తీసుకున్నావ్. మీ ఆవిడ రూ.10వేలు దొబ్బింది. రుణమాఫీ వస్తే దొబ్బారు. ఇవన్నీ దొబ్బి ..మనకు ఓట్లు వేయకపోతే నిలదీయండి అంటూ మంత్రి అచ్చెన్నాయుడు తమ అనుచరులకు స్పష్టం చేశారు. 

మంత్రిగారి సూచనలు విన్న కార్యకర్తలంతా ఒక్కసారిగా అవాక్కయ్యారట. ప్రజాస్వామ్యంలో ఓటును అది చేశాం ఇది చేశాం ప్రభావితం చెయ్యకూడదన్న విషయం మంత్రికి తెలియదా అంటూ గుసగుసలాడుకున్నారట. 

ప్రజాస్వామ్యంలో ప్రజల పట్ల ఎంతో గౌరవంగా మాట్లాడాల్సిన మంత్రి ఇలా మాట్లాడతారేంటంటూ విస్తుపోయారట. మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. 

click me!