కాపీ కొడితే డిబార్, చంద్రబాబును ఏం చేయాలి: రోజా

Published : Jan 29, 2019, 05:34 PM IST
కాపీ కొడితే డిబార్, చంద్రబాబును ఏం చేయాలి: రోజా

సారాంశం

చంద్రబాబు ఎక్స్పైర్‌ అయిన టాబ్లెట్‌ లాంటోడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ జగన్‌ అప్‌డేటెడ్‌ వెర్షన్‌ అయితే బాబు ఔట్‌ డేటెడ్‌ వెర్షన్‌ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల సమయంలో బాబు వస్తే జాబు అని హామిలిచ్చిన చంద్రబాబు తన కొడుక్కి మాత్రమే మంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు.

నల్లజర్ల: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నలభైఏళ్ల వైఎస్‌ జగన్‌ పథకాల్ని కాపీ కొడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పరీక్షల్లో కాపీ కొట్టిన విద్యార్థిని డీబార్‌ చేస్తుంటారు. మరి వైఎస్సార్‌సీపీ హామీలను కాపీ కొట్టిన చంద్రబాబును ఏం చేయాలి అని రోజా ప్రశ్నించారు. నల్లజర్ల మండలంలోని తెలికిచెర్ల గ్రామంలో నిన్ను నమ్మం బాబు కార్యక్రమంలో పాల్గొన్న ఫైర్ బ్రాండ్ రోజా చంద్రబాబుపై ధ్వజమెత్తారు. 

చంద్రబాబు ఎక్స్పైర్‌ అయిన టాబ్లెట్‌ లాంటోడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ జగన్‌ అప్‌డేటెడ్‌ వెర్షన్‌ అయితే బాబు ఔట్‌ డేటెడ్‌ వెర్షన్‌ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల సమయంలో బాబు వస్తే జాబు అని హామిలిచ్చిన చంద్రబాబు తన కొడుక్కి మాత్రమే మంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు.పెంచిన పెన్షన్‌ 2వేల రూపాయలను బాబు రెండు నెలలు మాత్రమే ఇస్తాడన్నారు. అదే జగన్‌కు ఓటువేస్తే జీవితాంతం ఇస్తాడని ఎమ్మెల్యే రోజా చెప్పుకొచ్చారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu