
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. రాష్ట్రంలోని పలు రిజిస్ట్రార్ ఆఫీసుల్లో బుధవారం ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. విశాఖ, బద్వేల్, తుని, మేడికొండూరు, తిరుపతి , అనంతపురం, నర్సాపురం, జలమూరు సహా పలు ప్రాంతల్లో వున్న రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ దాడులు చేసింది. ఏసీబీ 14400 నెంబర్‌కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా కీలకమైన ఫైళ్లను పరిశీలిస్తున్నారు ఏసీబీ అధికారులు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.