దుర్గగుడిలో మరోసారి ఏసీబీ సోదాలు.. ఈవో కార్యాలయంపై గురి

Siva Kodati |  
Published : Feb 24, 2021, 04:14 PM IST
దుర్గగుడిలో మరోసారి ఏసీబీ సోదాలు.. ఈవో కార్యాలయంపై గురి

సారాంశం

విజయవాడ దుర్గగుడిలో మరోసారి ఏసీబీ దాడులకు దిగింది. బుధవారం జమ్మిదొడ్డిలోని ఆలయ పరిపాలనా కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

విజయవాడ దుర్గగుడిలో మరోసారి ఏసీబీ దాడులకు దిగింది. బుధవారం జమ్మిదొడ్డిలోని ఆలయ పరిపాలనా కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

15 మంది అధికారుల బృందం ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగంలో రికార్డులను ఏసీబీ పరిశీలిస్తోంది. సస్పెన్షన్‌కు గురైన అధికారుల నుంచి అధికారులు కొన్ని వివరాలు సేకరిస్తున్నారు.

Also Read:దుర్గగుడిలో అక్రమాలు.. సర్కార్‌ యాక్షన్, ఇప్పటి వరకు 26 మందిపై వేటు

ఎప్పుడు విధుల్లో చేరారు. ఎంత కాలం నుంచి విధులు నిర్వహిస్తున్నారని ఆరా తీశారు. ఇప్పటికే గత మూడు రోజులుగా సోదాలు నిర్వహించిన అధికారులు.. పరిపాలనా కార్యాలయానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్పటి వరకు 26 మందిపై సర్కార్ సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే మరికొందరిపైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?