ఏలూరులో ఆందోళన... 100మందికి అస్వస్థత

By Arun Kumar PFirst Published Dec 6, 2020, 8:14 AM IST
Highlights

శనివారం సాయంత్రం నుంచి రాత్రి 12 గంటల వరకు ఆసుపత్రికి 95 మంది ఇదే రకమైన అస్వస్థతతో వచ్చారని ఏలూరు జిల్లా ఆసుపత్రిడాక్టర్లు తెలిపారు.

ఏలూరు:  పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో శనివారం ఉన్నట్టుండి 100మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి నగరంలోని పడమరవీధి, కొత్తపేట, తాపీమేస్త్రీ కాలనీ, అశోక్‌నగర్‌, తంగెళ్లమూడి, శనివారపుపేట, ఆదివారపుపేట, అరుంధతిపేట తదితర ప్రాంతాల్లోని ప్రజలు ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు.

శనివారం సాయంత్రం నుంచి రాత్రి 12 గంటల వరకు ఆసుపత్రికి 95 మంది ఇదే రకమైన అస్వస్థతతో వచ్చారని ఏలూరు జిల్లా ఆసుపత్రిడాక్టర్లు తెలిపారు.వీరిలో 22 మంది చిన్నపిల్లలు, 40 మంది మహిళలు 33 మంది పురుషులు ఉన్నారని తెలిపారు.

శనివారం అర్ధరాత్రి డాక్టర్ల బృందం పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆరోగ్యంగా 20 మంది బాధితులు పూర్తి ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించే విషయంలో ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్ల ప్రత్యేక పర్యవేక్షణ లో ఏలూరు కార్పొరేషన్లో అధికారులతో సమావేశం నిర్వహించి మోనిటరింగ్ చేశారు.

అనారోగ్యానికి గురై ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను స్వయంగా పరామర్శించి, మెరుగైన వైద్యం సదుపాయం కల్పించాలని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆదేశించారు మంత్రి.  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు ఆదేశాల మేరకు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంచార్జి డిసిహెచ్ఎస్ డాక్టర్ ఎ వి ఆర్ పర్యవేక్షణలో వైద్యుల బృందం ప్రత్యేకంగా వైద్య సేవలు అందిస్తోంది. ఏలూరు నగరంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి పేర్కొన్నారు.
 


 

click me!