అప్పటివరకు రూ. 25 లక్షలు తీసుకోను, తెల్లకాగితాలపై సంతకాలు పెట్టాలని ఒత్తిడి: అబ్దుల్ సలాం అత్త

Published : Nov 12, 2020, 11:23 AM IST
అప్పటివరకు రూ. 25 లక్షలు తీసుకోను, తెల్లకాగితాలపై సంతకాలు పెట్టాలని  ఒత్తిడి: అబ్దుల్ సలాం అత్త

సారాంశం

నంద్యాల సీఐ సోమశేఖర్ రెడ్డిని ఉద్యోగం నుండి తొలగించేవరకు ప్రభుత్వం నుండి ఇచ్చిన పరిహారం  రూ. 25 లక్షలు తీసుకోబోనని ఆత్మహత్య చేసుకొన్న ఆటోడ్రైవర్ అబ్దుల్ సలాం అత్త తెలిపారు

నంద్యాల సీఐ సోమశేఖర్ రెడ్డిని ఉద్యోగం నుండి తొలగించేవరకు ప్రభుత్వం నుండి ఇచ్చిన పరిహారం  రూ. 25 లక్షలు తీసుకోబోనని ఆత్మహత్య చేసుకొన్న ఆటోడ్రైవర్ అబ్దుల్ సలాం అత్త తెలిపారు. గత రాత్రి ఇద్దరు పోలీసులు వచ్చి తెల్ల కాగితాలపై తనను సంతకం చేయాలని ఒత్తిడి తెచ్చారని ఆమె మీడియాకు తెలిపారు.

నంద్యాల: తన కూతురు, అల్లుడు, మనమడు, మనరాలి సామూహిక ఆత్మహత్యకు కారణమైన నంద్యాల సీఐ సోమశేఖర్ రెడ్డిని ఉద్యోగం నుండి తొలగించేవరకు ప్రభుత్వం ప్రకటించిన రూ. 25 లక్షల పరిహారాన్ని తీసుకోనని ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం అత్త  మాబున్నీసా ప్రకటించారు.

also read:నంద్యాలలో సలాం కుటుంబం సూసైడ్: జగన్ స్పందన ఇదీ

ఈ నెల 3వ తేదీన నంద్యాలలో ఆటో డ్రైవర్  సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.బుధవారం నాడు రాత్రి పోలీసులు తమ ఇంటికి వచ్చారని ఆమె చెప్పారు. తెల్లకాగితాలపై సంతకాలు పెట్టాలని కోరారని చెప్పారు. మహిళా ఎస్ఐ, కానిస్టేబుల్ వచ్చారన్నారు. 

 

తన ఫోన్ నెంబర్ అడిగారని... తన వద్ద ఫోన్ లేదని చెబితే తమ కోడలు నెంబర్ తీసుకొన్నాడని చెప్పారు.  తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టాలని కోరారని.... కానీ తాము సంతకాలు పెట్టలేదని మాబున్నీసా చెప్పారు.

ఈ విషయమై  కలెక్టర్ కు కూడ ఫిర్యాదు చేశామని ఆమె తెలిపారు. తమ కూతురు, అల్లుడు చనిపోయిన తర్వాత ఆ డబ్బులు తీసుకొని ఏం చేయాలని ఆమె ప్రశ్నించారు.తమ కూతురు, అల్లుడి మరణానికి కారణమైన సీఐ వేణుగోపాల్ రెడ్డిని ఉద్యోగం నుండి తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు.

సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకొన్న విషయం తెలిసిన వెంటనే ఏపీ సీఎం జగన్ బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐపై చర్యలు తీసుకొనేంత వరకు పరిహారం తీసుకోనని మాబున్నీ తేల్చి చెప్పారు.
 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu