
కువైట్ (kuwait)లో మూడు హత్యల కేసులో నిందితుడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ (andhra pradesh) రాష్ట్రం కపడ (kadapa) జిల్లాకు చెందిన వెంకటేష్ (venkatesh) సూసైడ్ చేసుకున్నాడు. జైలు గదిలోనే ఆయన చనిపోయారని కువైట్ జైలు ఆఫీసర్లు తెలిపారు. జైలులో నిద్రించే మంచానికి ఉన్న తాడుతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ధృవీకరించారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
కువైట్ జైలులో ఉంటున్న వెంకటేష్ చనిపోయాడన్న విషయంలో ఇక్కడ ఉంటున్న ఫ్యామిలీ మెంబర్స్ కు ఆఫీసర్లు తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న వెంకటేష్ కుటుంబ సభ్యులు ఒక్క సారిగా ద్రిగ్భాంతికి గురయ్యారు. కువైట్ జైలులో శిక్ష అనుభవిస్తున్న తమ బిడ్డ.. నిర్దోషిగా బయటకు వస్తాడని ఎదురుచూశామని, కానీ ఎంతలోనే ఈ ఘటన చోటు చేసుకుందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సూసైడ్ చేసుకునే వ్యక్తి కాదని, జైలు ఆఫీసర్లే అతడిని హత్య చేసి ఉంటారని నిందితుడి భార్య ఆరోపించింది. వెంకటేష్ సూసైడ్ చేసుకున్న విషయం తెలియడంతో లక్కిరెడ్డిపల్లి మొత్తం విషాదంలో మునిగిపోయింది.
వెంకటేష్ ది కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండల పరధిలో ఉన్న దిన్నపాడు కస్బా (dinnepadu kasba) గ్రామం. తండ్రి పేరు శ్రీరాములు. అయితే వెంకటేష్ జీవనోపాధి కోసం మూడు సంవత్సరాల క్రితం కువైట్ కు వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తి ఇంట్లో డ్రైవర్ (driver) ఉద్యోగం దొరికింది. దీంతో అక్కడే పని చేశాడు. రెండు సంవత్సరాల తరువాత భార్య స్వాతి (swathi)ని కూడా అక్కడికి తన వెంట తీసుకువెళ్లాడు. ఇద్దరూ అక్కడే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే వారి ఇద్దరు పిల్లలు సొంత గ్రామంలో వెంకటేష్ తండ్రి అయిన శ్రీరాములు (sriramulu) వద్ద ఉండి చదువుకుంటున్నారు.
అంతా సక్రమంగా సాగిపోతున్న సమయంలో అక్కడ ఓ ఘటన జరిగింది. కువైట్ లో వెంకటేష్ డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్న ఆయన యజమాని నివాసరంలో కొంత కాలం కిందట చోరీ జరిగింది. కొందరు గుర్తు తెలియని దుండగులు ఆ ఇంటి ఓనర్ (owner), ఆయన భార్య, కుమార్తెను చంపేశారు. అనంతరం అక్కడ ఉన్న బంగారపు నగలను, నగదును దోచుకెళ్లారు. కాగా ఈ దోపిడి చేసింది వెంకటేష్ అని, వారిని చంపింది కూడా ఆయనే అని కువైట్ పోలీసులు అనుమానించి అతడిని అరెస్ట్ చేశారు. చనిపోయిన వ్యక్తుల సెల్ ఫోన్ (cell phone) నుంచి వెంకటేష్ కు ఎక్కువ సార్లు కాల్స్ (calls) వచ్చాయని, ఆ డేటాను సాకుగా చూపి, అనుమానంతో ఆయనను అరెస్టు చేసి జైలుకు తీసుకెళ్లారు.
కాగా..ఈ మర్డర్ లకు వెంకటేష్ కు ఏ సంబంధమూ లేదని భార్య స్వాతి మొదటి నుంచీ చెబుతోంది. తన భర్తపై కావాలనే తప్పుడు కేసు బనాయించి, జైలులో చిత్రహింసలు పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన భర్తను అరెస్టు చేసి, తనను బలవంతం మీద మన దేశానికి పంపించారని తెలిపింది. హత్యకు గురైన ఓనర్లు పనిలో భాగంగానే వెంకటేష్ కు ఫోన్లు చేసేవారని ఆమె చెప్పారు. దాని కంటే తమకు ఏమీ తెలియదని తెలిపారు. తన భర్త మర్డర్ చేసి ఉంటే సీసీ కెమెరాల్లో రికార్డు అయి ఉంటుందని, కానీ వాటిని బయటపెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
హత్యకు గురైన ఓనర్లకు, వారి బంధువులతో తగాదాలు ఉన్నాయని తెలిపారు. వారే ఈ మర్డర్లు చేసి కావాలనే తన భర్తను ఇరికించి ఉంటారని ఆమె ఆరోపిస్తోంది. బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లిన తాము ఇలాంటి హత్యలు ఎందుకు చేశామని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇటీవలే తమ భర్తను కువైట్ జైలులో నుంచి బయటకు తీసుకురావాలని కడప జిల్లా కలెక్టర్ (collector) ను కలిసి విన్నవించింది. భర్తను విడిపించడానికి భార్య స్వాతి ఇక్కడ ప్రయత్నాలు చేస్తుండగానే జైలులో వెంకటేష్ చనిపోయాడు. కాగా మృతదేహాన్ని భారత్ కు పంపిస్తారా లేక అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తారా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.