సీఎం జగన్ కు డబుల్ ధమాకా, ఈడీకి అక్షింతలు: రూ.746.17 కోట్లు జప్తు రద్దు

By Nagaraju penumalaFirst Published Jul 30, 2019, 9:04 PM IST
Highlights


ఇకపోతే వైయస్ భారతి ఆస్తులను జప్తు చేయడంపై అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె ఆస్తులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా భారతి జీతం సొమ్మును సైతం జప్తు చేయడంపై అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు సరిగా జరగలేదని ఆరోపించింది. నిబంధనలు పాటించకుండా విచారణ జరిపారని మండిపడింది. 

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి బంపర్ బొనాంజ తగిలింది. జగన్ ఆస్తుల కేసులో 13 అప్పీళ్లకు సంబంధించి ఈడీ జప్తు చేసిన ఆస్తులను వెంటనే విడుదల చేయాలని అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశించింది. 

వాన్ పిక్ కేసులో ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను తిరిగి ఇచ్చేయాలని అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశించింది. అంతేకాదు జగన్ ఆస్తులను అటాచ్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. 
అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశాలతో సీఎం వైయస్ జగన్ తోపాటు వాన్ పిక్ కేసు ఎదుర్కొంటున్న ప్రముఖ వ్యాపార వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ లకు చెందిన ఆస్తులను కూడా విడుదల చేయాలని ఆదేశించింది.  

మరోవైపు నిమ్మగడ్డ ప్రసాద్ కు సంబంధించిన రూ.324 కోట్లను ఈడీ గతంలో అటాచ్ చేసింది. ఆ ఆస్తులను కూడా విడుదల చేయాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. అయితే నిమ్మగడ్డ ప్రసాద్ ను రూ.274 కోట్ల రూపాయల బ్యాంకు గ్యారంటీని చూపించాలని ఆదేశించింది. 

భారతి సిమ్మెంట్ కేసులోనూ జగన్ కు ఊరట:  

భారతి సిమ్మెంట్ కేసులోనూ జగన్, భారతిలకు సంబంధించి జప్తు చేసిన ఆస్తులను విడుదల చేయాలని ఆదేశించింది. జగన్ ఆస్తుల కేసులో భారతి సిమ్మెంట్స్ కు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రూ.746 కోట్లకు సంబంధించి ఆస్తులను అటాచ్ చేసింది. ఈడీ అడ్జ్యులేటింగ్ అథారిటీ ఇచ్చిన ఉత్తర్వులను అప్పిలేట్ ట్రిబ్యునల్ సవరణలు చేసింది. 

బ్యాంకు డిపాజిట్లకు సంబంధించి రూ.192 కోట్లకు బ్యాంకు గ్యారంటీని తీసుకుని మిగిలిన ఆస్తులపై జప్తు తొలగించాలని ఆదేశించింది. భారతి సిమ్మెంట్స్ తో సంబంధం ఉన్న ఆస్తులు, డిపాజిట్లు, వాటాలు మెుత్తం రూ.746.17 కోట్లను 2016 జూన్ 29న అటాచ్ చేసింది ఈడీ. అందులో జగన్ కు చెందిన రూ.569.57 కోట్లు, భారతకికి చెందిన రూ.22.31 కోట్లు, భారతి సిమ్మెంట్సక్ దాని గ్రూపునకు సంబంధించి రూ.154.29  కోట్లు జప్తు చేసింది. 
 
ఈడీ జప్తు చేసిన జగన్ కు చెందిన ఆస్తులను విడుదల చేయాలని ఆదేశించడంతో ఇడుపుపాయలోని 42 ఎకరాలభూమి, పులివెందులలో 16 ఎరాలు, బంజారాహిల్స్ లో సాగర్ సొసైటీలో ప్లాట్లు, ఓ కమర్షియల్ స్థలం, షేర్లు, ఓ టీవీ ఛానెల్ కు సంబంధించిన యంత్రాలు విడుదల కాబోతున్నాయి. 

ఈడీ ఆస్తుల జప్తుపై సీఎం వైయస్ జగన్, వైయస్ భారతీరెడ్డిలతోపాటు జగన్ గ్రూపు కంపెనీలు 14 అప్పీళ్లను దాఖలు చేశాయి. వీటిపై విచారణ చేపట్టిన అప్పిలేట్ ట్రిబ్యునల్ భారతి సిమ్మెంట్స్ వ్యవహారంలో విడిగానూ, మిగిలిన 13 అప్పీళ్లపై ఒకరకంగా విచారణ చేపట్టి ఒకే ఉత్తర్వులను జారీ చేసింది. 

భారతి జీతం సొమ్ము జప్తుపై ఈడీకి ట్రిబ్యునల్ అక్షింతలు:

ఇకపోతే వైయస్ భారతి ఆస్తులను జప్తు చేయడంపై అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె ఆస్తులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా భారతి జీతం సొమ్మును సైతం జప్తు చేయడంపై అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

దర్యాప్తు సరిగా జరగలేదని ఆరోపించింది. నిబంధనలు పాటించకుండా విచారణ జరిపారని మండిపడింది. ఒక్కో షేరుకు రూ.671.20 పైసలు పెంచుతూ ఫ్రెంచ్ కంపెనీ చెల్లింపులు చెల్లిస్తే వాటిని ముడుపులుగా ఎలా పరిగణిస్తారని ఈడీ ప్రశ్నించింది. షేర్ల మార్కెట్ విలువలు పెరిగడం, చెల్లింపులను ముడుపులుగా ఎలా చూపిస్తారంటూ ఈడీని ప్రశ్నించింది అప్పిలేట్ ట్రిబ్యునల్. 

ఈ వార్తలు కూడా చదవండి

ఆస్తుల కేసులో సీఎం జగన్ కు ఊరట: ఆస్తులు తిరిగి ఇచ్చేయాలని ఈడీకి ట్రిబ్యునల్ ఆదేశం

click me!