న్యాయం కావాలి.. మంత్రి విడుదల రజని కార్యాలయం ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

By Bukka Sumabala  |  First Published Sep 3, 2022, 9:08 AM IST

న్యాయం కావాలంటూ ఓ వ్యక్తి మంత్రి విడుదల రజని కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం చేశాడు. పురుగుల మందు తాగి కుప్పకూలిపోయాడు. 


గుంటూరు జిల్లా : గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో న్యాయం జరగలేదని, మంత్రి కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు.  తనకు న్యాయం జరగలేదంటూ మంత్రి విడదల రజని కార్యాలయం వద్ద ఓ కల్లు గీత కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తనతో తెచ్చుకున్న పురుగుల మందు తాగి రహదారిపై కుప్పకూలాడు.

అయితే, ఇది గమనించిన స్థానికులు అతడిని చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో అతనికి ఆస్పత్రి సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మంత్రి విడదల రజిని కార్యాలయం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించటం కలకలం రేపింది. బాధితుడు పట్టణ శివారు గ్రామమైన మానకొండవారిపాలెంకు చెందిన కల్లుగీత కార్మికుడు వెంకటేశ్వర్లుగా గుర్తించారు. 

Latest Videos

మధ్యాహ్నం మంత్రి కార్యాలయం వద్దకు వచ్చిన వెంకటేశ్వర్లు.. తనకు న్యాయం జరగలేదంటూ పురుగుల మందు తాగాడు. కాసేపటికే రహదారిపై కుప్పకూలి పడిపోయాడు. ఇది గమనించిన వారు వెంటనే చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు.

పోలవరంకు అనుమతులన్నీ వైఎస్ హయాంలోనే.. డయాఫ్రం వాల్ కొట్టుకుపోతే చర్యలేవి : ఉండవల్లి అరుణ్ కుమార్

click me!