శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో భారీ అగ్నిప్రమాదం..90 బైక్ లు దగ్థం.. (వీడియో)

Published : Apr 19, 2023, 08:17 AM ISTUpdated : Apr 19, 2023, 09:36 AM IST
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో భారీ అగ్నిప్రమాదం..90 బైక్ లు దగ్థం.. (వీడియో)

సారాంశం

శ్రీకాకుళం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బైక్ షోరూంలో చెలరేగిన మంటలకు 90 బైక్ లు దగ్ఘమయ్యాయి.

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో భారీ అగ్నిప్రమాదం బుధవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ బైక్ షోరూంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. ఎలక్ట్రిక్ బైక్ కు ఛార్జింగ్ చేస్తుండగా మంటలు ఎగిసిపడ్డాయి. 90 ఎలక్రికల్ బైక్ లు అగ్నికి ఆహుతి అయ్యాయి. పక్కనే ఉన్న హార్డ్ వేర్ షాపుకు మంటలు  అంటుకున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. 

శ్రీకాకుళం జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. పలాస-కాశీబుగ్గలో భగవతి థియేటర్ రోడ్డులోని బైక్ షోరూమ్, హార్డ్వేర్ షాపులో మంటలు చెలరేగాయి. బుధవారం తెల్లవారుజామున పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు షాపు యజమానులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు అగ్నిమాపక సిబ్బంది స్థానికులతో కలిసి మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్య్కూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే బైక్ షోరూమ్ బ్యాటరీ పేలడంతో ఘటన జరిగినట్లు చెబుతున్నారు.

ఈ ఘటనలో మొత్తం 70కి పైగా ద్విచక్ర వాహనాలు పూర్తి దగ్ధమైనట్లు యజమానులు చెబుతున్నారు. ముందు బైక్ షోరూమ్లో మంటలు చెలరేగగా.. ఆ తర్వాత పక్కనే ఉన్న హార్డ్ వేర్ షాపులోకి కూడా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో మూడు షాపులు దగ్ధమయ్యాయి. బైక్ షోరూమ్తో పాటుగా బ్యాటరీ షాపు, హార్డ్వేర్ షాపు కూడా దగ్ధమైంది. భారీగా ఆస్తి నష్టం సంబంధించిందని యజమానులు చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Pressmeet: పోలవరం ప్రాజెక్ట్ పనుల పైసీఎం చంద్రబాబు కీలక ప్రెస్ మీట్ | Asianet Telugu
పోలవరం ప్రాజెక్ట్ పనులు పరిశీలించిన సీఎం చంద్రబాబు | CM Chandrababu Reviews Polavaram Project Works