కొత్తగా 9,999 మందికి కరోనా : ఏపీలో ఐదున్నర లక్షలకు చేరువలో కేసులు

Siva Kodati |  
Published : Sep 11, 2020, 05:36 PM ISTUpdated : Sep 11, 2020, 05:41 PM IST
కొత్తగా 9,999 మందికి కరోనా : ఏపీలో ఐదున్నర లక్షలకు చేరువలో కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,999 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో కలిపి ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 5,47,686కి చేరింది. గత 24 గంటల్లో వైరస్ కారణంగా 77 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 4,779కి చేరుకుంది. 

ప్రస్తుతం రాష్ట్రంలో 96,191 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 4,46,716 మంది డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్క రోజే ఏపీలో 71,137 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో ఇప్పటి వరకు టెస్టుల సంఖ్య 44,52,128కి చేరుకుంది.

గత 24 గంటల్లో అనంతపురం 557, చిత్తూరు 1,040, తూర్పు గోదావరి 1,499, గుంటూరు 920, కడప 698, కృష్ణ 451, కర్నూలు 497, నెల్లూరు 778, ప్రకాశం 901, శ్రీకాకుళం 570, విశాఖపట్నం 413, విజయనగరం 594, పశ్చిమ గోదావరిలలో 1,081 కేసులు నమోదయ్యాయి.

నిన్న ఒక్క రోజే 11,069 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే కోవిడ్ కారణంగా గత 24 గంటల్లో కడప 9, చిత్తూరు 8, నెల్లూరు 8, ప్రకాశం 8, గుంటూరు 7, కృష్ణ 7, అనంతపురం 6, విశాఖపట్నం 6, విజయనగరం 5, పశ్చిమ గోదావరి 5, తూర్పుగోదావరి 4, శ్రీకాకుళం 3, కర్నూలు జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించారు. 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం
అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu