ఏపీలో కరోనా ఉద్ధృతి: కొత్తగా 9,927 కేసులు, 92 మరణాలు

By Siva KodatiFirst Published Aug 25, 2020, 7:02 PM IST
Highlights

ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తూనే ఉంది. 24 గంటల్లో 9,927 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది

ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తూనే ఉంది. 24 గంటల్లో 9,927 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 3,71,639కి చేరింది.

గత 24 గంటల్లో వైరస్ కారణంగా 92 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 3,460కి చేరుకుంది. నిన్న 64,351 మంది శాంపిల్స్ పరీక్షంచడంతో మొత్తం టెస్టుల సంఖ్య 33,56,852కి చేరింది.

గడిచిన 24 గంటల్లో 9,419 మంది కోవిడ్ నుంచి కోలువడంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 2,78,247కి చేరుకుంది. ఏపీలో ప్రస్తుతం 89,932 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న తూర్పు గోదావరి జిల్లాలో 1,353 కేసులు నమోదయ్యాయి.

ఆ తర్వాత అనంతపురం 494, చిత్తూరు 967, గుంటూరు 917, కడప 521, కృష్ణా 322, కర్నూలు 781, నెల్లూరు 949, ప్రకాశం 705, శ్రీకాకుళం 552, విశాఖపట్నం 846, విజయనగరం 667, పశ్చిమ గోదావరిలలో 653 మందికి పాజిటివ్‌గా తేలింది.

కరోనా కారణంగా చిత్తూరు జిల్లాలో 16, అనంతపురం 11, కడప 10, ప్రకాశం 10, తూర్పుగోదావరి 8, పశ్చిమ గోదావరి 8, గుంటూరు 6, నెల్లూరు 6, శ్రీకాకుళం 6, విశాఖపట్నం 6, కృష్ణ 4, విజయనగరంలలో ఒక్కరు మరణించారు. 

 

: 25/08/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 3,68,744 పాజిటివ్ కేసు లకు గాను
*2,75,352 మంది డిశ్చార్జ్ కాగా
*3,460 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 89,932 pic.twitter.com/FOzl7sp4Qw

— ArogyaAndhra (@ArogyaAndhra)

 

click me!