విహారయాత్రలో విషాదం... పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం, 9 మందికి తీవ్రగాయాలు

Siva Kodati |  
Published : Aug 12, 2022, 06:16 PM ISTUpdated : Aug 12, 2022, 06:48 PM IST
విహారయాత్రలో విషాదం... పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం, 9 మందికి తీవ్రగాయాలు

సారాంశం

పల్నాడు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. నాగార్జున సాగర్ అందాలను చూసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులంతా హైదరాబాద్‌కు చెందినవారుగా తెలుస్తోంది. 

విహారయాత్రలో ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడగా.. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా వుంది. బాధితులంతా హైదరాబాద్‌కు చెందిన వారుగా తెలుస్తోంది. నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో సాగర్‌కు పర్యాటకుల తాకిడి పెరిగింది. సాగర్‌ వాటర్‌ను చూసేందుకు హైదరాబాద్ నుంచి కొందరు యువకులు కార్లలో వెళ్లారు. అయితే మాచర్ల మండలం ఏకోనాంపేటలో ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన కార్లు ఢీకొనడంతో తొమ్మిది మంది యువకులు గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు .. బాధితులను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో నలుగురికి సీరియస్‌గా వున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

PREV
click me!

Recommended Stories

Mudragada: 6 సార్లు ఎమ్మెల్యే, ఒక‌సారి ఎంపీ.. కాపునేత ముద్ర‌గ‌డ ఇక‌లేరు
Rain Alert: జూలై సెకండాఫ్ లో వర్షాలే వర్షాలు | Heavy Rains Likely Across Andhra Pradesh & Telangana