ఏపీలో 8 వేలకు పడిపోయిన కేసులు.. కలవరపెడుతున్న మరణాలు, తూ.గోలో తీవ్రత

Siva Kodati |  
Published : Jun 06, 2021, 06:05 PM IST
ఏపీలో 8 వేలకు పడిపోయిన కేసులు.. కలవరపెడుతున్న మరణాలు, తూ.గోలో తీవ్రత

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా తగ్గాయి.  గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 8,976 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 17,58,339కి చేరుకుంది

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా తగ్గాయి.  గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 8,976 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 17,58,339కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 90 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 11,466కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విజయనగరం 8, ప్రకాశం 7, అనంతపురం 8, తూర్పుగోదావరి 6, చిత్తూరు 12, గుంటూరు 8, కర్నూలు 6, నెల్లూరు 6, కృష్ణ 5, విశాఖపట్నం 5, శ్రీకాకుళం 8, పశ్చిమ గోదావరి 9, ప్రకాశం 3, కడపలో ఇద్దరు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 13,568 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 16,23,447కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 83,690 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,97,91,721కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,23,426 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 995, చిత్తూరు 1232, తూర్పుగోదావరి 1669, గుంటూరు 578, కడప 523, కృష్ణ 726, కర్నూలు 361, నెల్లూరు 396, ప్రకాశం 506, శ్రీకాకుళం 381, విశాఖపట్నం 700, విజయనగరం 298, పశ్చిమ గోదావరిలలో 611 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

Ambati Rambabu Comments: సీఎం చంద్రబాబుపై అంబటి సెటైర్లు | Asianet News Telugu
తెలుగు రాష్ట్రాల్లోఈ జిల్లాలకు రెయిన్ అలెర్ట్: Andhra Pradesh & Telangana Rain Alert| Asianet Telugu