కొత్తగా 8,702 మందికి కరోనా: ఏపీలో 6 లక్షలు దాటిన కేసులు

By Siva KodatiFirst Published Sep 17, 2020, 6:52 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 6 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,702 కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,01,462కి చేరింది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 6 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,702 కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,01,462కి చేరింది.

నిన్న ఒక్క రోజే వైరస్ కారణంగా 72 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 5,177కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 10,712 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 5,08,088కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 88,187 యాక్టివ్ కేసులున్నాయి.

నిన్న ఒక్కరోజే 77,492 మంది శాంపిల్స్ పరీక్షించడంతో ఏపీలో మొత్తం టెస్టుల సంఖ్య 48,84,371కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో అనంతపురంలో 545, చిత్తూరు 905, తూర్పు గోదావరి 1,383, గుంటూరు 550, కడప 637, కృష్ణ 367, కర్నూలు 394, నెల్లూరు 610, ప్రకాశం 705, శ్రీకాకుళం 567, విశాఖపట్నం 449, విజయనగరం 526, పశ్చిమ గోదావరిలలో 1064 కేసులు నమోదయ్యాయి.

అలాగే నిన్న ఒక్క రోజే చిత్తూరు 12, ప్రకాశం 10, కడప 7, గుంటూరు 6, కర్నూలు 6, నెల్లూరు 6, తూర్పుగోదావరి 5, కృష్ణ 5, అనంతపురం 4, విశాఖపట్నం 4, పశ్చిమ గోదావరి 4, శ్రీకాకుళం 2, విజయనగరంలో ఒక్కరు చొప్పున మరణించారు. 


 

: 17/09/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 5,98,567 పాజిటివ్ కేసు లకు గాను
*5,05,193 మంది డిశ్చార్జ్ కాగా
*5,177 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 88,197 pic.twitter.com/VANbv0Mca0

— ArogyaAndhra (@ArogyaAndhra)

 

 

click me!