పూర్తిగా విస్తరిస్తున్న రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ తీపికబురు

By Siva KodatiFirst Published Jun 10, 2021, 4:04 PM IST
Highlights

ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. అరేబియా సముద్రంలో నైరుతి గాలులు బలపడంతో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోని తుని వరకు, తెలంగాణలో భద్రాచలం, మహారాష్ట్ర, గుజరాత్‌తో పాటు ఉత్తర బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకు విస్తరించినట్లు తెలిపింది

ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. అరేబియా సముద్రంలో నైరుతి గాలులు బలపడంతో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోని తుని వరకు, తెలంగాణలో భద్రాచలం, మహారాష్ట్ర, గుజరాత్‌తో పాటు ఉత్తర బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకు విస్తరించినట్లు తెలిపింది. ఇదే సమయంలో తూర్పు మధ్య, దానికి ఆనుకుని ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో ఈ నెల 11న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ వెల్లడించింది.

Also Read:నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్: జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు స్వల్పంగా వరద

రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావాలతో గురు, శుక్రవారాల్లో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం పశ్చిమ గాలుల ప్రభావం కాస్త తగ్గడంతో రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 33-39 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. అటు రాయలసీమ, దక్షిణ కోస్తాలో కొద్దిగా ఎండ, వేడి గాలులు ఉండగా, ఉత్తర కోస్తాలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. మరోవైపు అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో రుతుపవనాలు బలపడి చురుగ్గా మారనున్నాయి. 

click me!