ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. తాపీమేస్త్రికి దేహశుద్ధి

Published : Jul 06, 2019, 11:28 AM IST
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. తాపీమేస్త్రికి దేహశుద్ధి

సారాంశం

కూతురు వయసు బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాగా.. గమనించిన స్థానికులు చిన్నారిని రక్షించి ఆ కామాంధుడికి దేహశుద్ధి చేశారు. 

కూతురు వయసు బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాగా.. గమనించిన స్థానికులు చిన్నారిని రక్షించి ఆ కామాంధుడికి దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పీలేరులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... పీలేరుకి చెందిన ఓ వ్యక్తి తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. కాగా... శనివారం ఉదయం అతను తన ఇంటి వద్ద నివసించే ఏడేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాగా... చిన్నారి కేకలతో గమనించిన స్థానికులు అతనిని పట్టుకున్నారు. అనంతరం అతని శరీరంపై దుస్తులు తొలగించారు. పట్టుకొని దేహ శుద్ధి చేశారు. నిందితుడిని ఫోటోలు తీసి.. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Ambati on Sankranthi Song: నేను సంక్రాంతికి గుర్తురావడానికి కారణం Pawan Kalyan | Asianet News Telugu
Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?