13ఏళ్ల బాలికకు ప్రేమ పేరిట వేధింపులు.. ఆత్మహత్య...

Published : Jan 25, 2021, 09:21 AM IST
13ఏళ్ల బాలికకు ప్రేమ పేరిట వేధింపులు.. ఆత్మహత్య...

సారాంశం

ప్రేమ వేధింపులు ఓ ముక్కుపచ్చలారని చిన్నారిని బలి తీసుకున్నాయి. అనంతపూర్ జిల్లా, కదిరిలో జరిగిన ఈ దారణంలో పదమూడేళ్ల బాలిక బలవన్మరణం పాలయ్యింది. కదిరి పట్టణ ఎస్‌ఐ మగ్బుల్‌బాషా తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణమ్మ కాలనీకి చెందిన శ్రీనివాసులు, గోరంట్ల ఆశావర్కర్‌ శ్రీవాణి దంపతులకు నిరతిశ్రీ (13) అనే కుమార్తె ఉంది. కదిరిలోని ప్రైవేట్‌ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. 

ఇదే కాలనీకి చెందిన బేల్దారి పని చేసుకునే హరి ప్రేమిస్తున్నానంటూ ఏడాది కాలంగా నిరతిశ్రీ వెంట పడుతున్నాడు. ఆ అమ్మాయి తిరస్కరించినా ప్రేమించాలంటూ ఒత్తిడి చేసేవాడు. ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలియడంతో హరిని మందలించారు. దీంతో తప్పయిపోయిందని, ఇక వెంటపడనని నమ్మబలికాడు. 

కొన్ని రోజులు కామ్ గా ఉండి తర్వాత తిరిగి వేధించడం మొదలుపెట్టాడు. అంతేకాదు, తన ప్రేమను ఆమోదించాలని, పెళ్లి చేసుకుని హాయిగా బతుకుదామని ఒత్తిడి పెంచాడు. ఇదే క్రమంలో శనివారం రాత్రి ఫోన్‌ చేసి తనను పెళ్లి చేసుకోకుంటే రచ్చ చేస్తానని బెదిరించాడు. 

బెదిరిపోయిన నిరతిశ్రీ తమ పరువు పోతుందని భావించింది.. అర్ధరాత్రి సమయంలో తండ్రి నిద్రపోతుండగా.. గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆశావర్కర్ అయిన తల్లి నైట్ డ్యూటీలో భాగంగా ఆ రోజు గోరంట్లలో ఉంది. విషయం తెలియగానే ఆదివారం ఇంటికి చేరుకుని బోరున విలపించింది. 

ఒక్కగానొక్క కుమార్తెను ప్రేమ పేరుతో పొట్టన పెట్టుకున్నాడంటూ రోదించింది. అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం తెలియగానే బేల్దారి హరి పరారయ్యాడు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మగ్బుల్‌బాషా తెలిపారు.
 
PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu