కొత్తగా 6,923 మందికి కరోనా: ఏపీలో 6,75,674కి చేరిన కేసులు

Siva Kodati |  
Published : Sep 27, 2020, 06:40 PM ISTUpdated : Sep 27, 2020, 06:47 PM IST
కొత్తగా 6,923 మందికి కరోనా: ఏపీలో 6,75,674కి చేరిన కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,923 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,75,674కి చేరింది. 

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,923 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,75,674కి చేరింది.

నిన్న ఒక్క రోజే కోవిడ్ కారణంగా 45 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 5,708కి చేరుకుంది. గత 24 గంటల్లో 7,796 మంది కరోనా నుంచి కోలుకోవడంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 6,05,090కి చేరింది.

ప్రస్తుతం ఏపీలో 64,876 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న ఒక్కరోజే 76,416 శాంపిల్స్‌ను పరీక్షించడంతో మొత్తం టెస్టుల సంఖ్య 56,00,202కి చేరుకుంది.

నిన్న ఒక్కరోజే అనంతపురం 480, చిత్తూరు 577, తూర్పుగోదావరి 1,006, గుంటూరు 535, కడప 472, కృష్ణ 333, కర్నూలు 229, నెల్లూరు 506, ప్రకాశం 659, శ్రీకాకుళం 503, విశాఖపట్నం 318, విజయనగరం 376, పశ్చిమ గోదావరిలలో 929 కేసులు నమోదయ్యాయి.

అలాగే ప్రకాశం 8, కృష్ణ 6, గుంటూరు 5, తూర్పుగోదావరి 4, పశ్చిమగోదావరి 4, అనంతపురం 3, కడప 3, కర్నూలు 3, నెల్లూరు 3, విశాఖపట్నం 3, చిత్తూరు 2, విజయనగరంలలో ఒక్కరు చొప్పున మరణించారు. 

 

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu