ఏపీలో పడిపోయిన కరోనా కేసులు: కొత్తగా 6,770 మందికి పాజిటివ్.. చిత్తూరులో మళ్లీ పెరిగిన మరణాలు

Siva Kodati |  
Published : Jun 13, 2021, 05:26 PM IST
ఏపీలో పడిపోయిన కరోనా కేసులు: కొత్తగా 6,770 మందికి పాజిటివ్.. చిత్తూరులో మళ్లీ పెరిగిన మరణాలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 6,770 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 18,09,844కి చేరుకుంది.


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 6,770 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 18,09,844కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 58 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 11,940కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విజయనగరం 3, ప్రకాశం 3, అనంతపురం 4, తూర్పుగోదావరి 7, చిత్తూరు 12, గుంటూరు 2, కర్నూలు 2, నెల్లూరు 2, కృష్ణ 3, విశాఖపట్నం 4, శ్రీకాకుళం 6, పశ్చిమ గోదావరి 7  కడపలో ముగ్గురు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 12,492 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 17,12,267కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 1,02,876 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,04,50,982కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 85,637 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 367, చిత్తూరు 968, తూర్పుగోదావరి 1199, గుంటూరు 433, కడప 473, కృష్ణ 440, కర్నూలు 299, నెల్లూరు 267, ప్రకాశం 530, శ్రీకాకుళం 491, విశాఖపట్నం 290, విజయనగరం 248, పశ్చిమ గోదావరిలలో 765 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం రూ.20 లక్షలు బురిడీ | Bus Conductor Accused of Cheating Woman
Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?