ఏపీలో అదుపులోనే కరోనా: కొత్తగా 6,617 కేసులు.. తూర్పుగోదావరిలో అత్యధికం

Siva Kodati |  
Published : Jun 16, 2021, 05:01 PM IST
ఏపీలో అదుపులోనే కరోనా: కొత్తగా 6,617 కేసులు.. తూర్పుగోదావరిలో అత్యధికం

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 6,617 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 18,26,751కి చేరుకుంది. 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 6,617 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 18,26,751కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 57 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 12,109కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విజయనగరం 2, ప్రకాశం 2, అనంతపురం 5, తూర్పుగోదావరి 5, చిత్తూరు 9, గుంటూరు 9, కర్నూలు 3, నెల్లూరు 2, కృష్ణ 5, విశాఖపట్నం 4, శ్రీకాకుళం 5, పశ్చిమ గోదావరి 4 కడపలో ఇద్దరు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 10,228 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 17,43,176కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 1,01,544 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,07,36,435కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 71,466 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 427, చిత్తూరు 780, తూర్పుగోదావరి 1397, గుంటూరు 361, కడప 379, కృష్ణ 407, కర్నూలు 217, నెల్లూరు 364, ప్రకాశం 526, శ్రీకాకుళం 405, విశాఖపట్నం 303, విజయనగరం 222, పశ్చిమ గోదావరిలలో 829 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఒకేసారి 5 అల్పపీడనాల అటాక్.. ఈ ప్రాంతాల్లో తుపానులు, భారీ వర్షాలతో అల్లకల్లోలమే..!
ఈ రాష్ట్రాలకు అన్యాయం జరగదు..మహిళా రిజర్వేషన్ బిల్లు పై Chandrababu Reaction | Asianet News Telugu