కృష్ణ, ప.గోలలో అత్యథికం: ఏపీలో 8.71 లక్షలకు చేరిన కేసులు

Siva Kodati |  
Published : Dec 05, 2020, 07:52 PM IST
కృష్ణ, ప.గోలలో అత్యథికం: ఏపీలో 8.71 లక్షలకు చేరిన కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 630 మందికి కోవిడ్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కేసుల సంఖ్య 8,71,305కి చేరుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 630 మందికి కోవిడ్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కేసుల సంఖ్య 8,71,305కి చేరుకుంది.

కోవిడ్ కారణంగా నిన్న ఒక్కరోజే నలుగురు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 7,024కి చేరింది. గత 24 గంటల్లో 882 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,58,115కి చేరుకుంది.

ప్రస్తుతం ఏపీలో 6,166 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న ఒక్కరోజే 57,132 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించడంతో ఇప్పటి వరకు మొత్తం పరీక్షల సంఖ్య 1,03,50,283కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో అనంతపురం 29, చిత్తూరు 89, తూర్పుగోదావరి 64, గుంటూరు 85, వైఎస్సార్ కడప 28, కృష్ణ 97, కర్నూలు 5, నెల్లూరు 32, ప్రకాశం 35, శ్రీకాకుళం 12, విశాఖపట్నం 40, విజయనగరం 24, పశ్చిమ గోదావరిలలో 90 కేసులు నమోదయ్యాయి. కరోనాతో కృష్ణా జిల్లాలో ఇద్దరు చనిపోగా.. చిత్తూరు, విజయనగరం జిల్లాల్లో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.  

PREV
click me!

Recommended Stories

రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతోంది ముఖ్యమంత్రి ఎక్కడ: లక్ష్మీ పార్వతి | Lakshmi Parvathi Comments
సచివాలయం ఉద్యోగులు VS పోలీస్ లు విజయవాడ ధర్నా చౌక్ వద్ద హై టెన్షన్ | Secretariat Employees Dharna