కొత్తగా 618 మందికి పాజిటివ్: ఏపీలో 8,73,457కి చేరిన కేసులు

Siva Kodati |  
Published : Dec 09, 2020, 07:39 PM IST
కొత్తగా 618 మందికి పాజిటివ్: ఏపీలో 8,73,457కి చేరిన కేసులు

సారాంశం

ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖంగా పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 618 మందికి కోవిడ్ సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనా కేసులు సంఖ్య 8,73,457కి చేరింది.

ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖంగా పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 618 మందికి కోవిడ్ సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనా కేసులు సంఖ్య 8,73,457కి చేరింది. కోవిడ్ కారణంగా నిన్న ఒక్కరోజే ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకు మొత్తం మృతుల సంఖ్య 7,045కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో 785 మంది కరోనా నుంచి కోలుకోవడంతో.. ఇప్పటి వరకు డిశ్చార్జ్‌ల సంఖ్య 8,61,153కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,259 యాక్టివ్ కేసులున్నాయి.

నిన్న 61,038 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో.. మొత్తం టెస్టుల సంఖ్య 1,05,70,843కి చేరింది. అనంతపురం 50, చిత్తూరు 76, తూర్పుగోదావరి 49, గుంటూరు 92, కడప 23, కృష్ణ 121, కర్నూలు 14, నెల్లూరు 29, ప్రకాశం 17, శ్రీకాకుళం 22, విశాఖపట్నం 44, విజయనగరం 15, పశ్చిమ గోదావరిలలో 66 కేసులు నమోదయ్యాయి. 

PREV
click me!

Recommended Stories

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇంటర్నెట్ లేకపోయినా పనిచేసే ఈ యాప్ ప్రత్యేకతలు ఇవే
TDP MLA Miriyala Sirisha Devi Emotional Speech About Pawan Kalyan | Adavi Thalli Bata 2.0