మిఠాయి కొనిపెడతానని చెప్పి.. నాలుగేళ్ల చిన్నారిపై తాత అఘాయిత్యం

Published : Apr 04, 2020, 11:36 AM IST
మిఠాయి కొనిపెడతానని చెప్పి.. నాలుగేళ్ల చిన్నారిపై తాత అఘాయిత్యం

సారాంశం

కూతురు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతుకుతున్న తల్లికి బాలిక ఏడుపు వినిపించింది. దీంతో ఆమె అటువైపునకు వెళ్లి చూడగా రక్తస్రావంతో కూతురు కనిపించింది. విషయం అర్ధం చేసుకున్న తల్లి ఆగ్రహంతో వృద్ధుడిని చితకబాది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది.  

మిఠాయి కొనిస్తానని చెప్పి.. వరసకు మనవరాలయ్యే నాలుగేళ్ల బాలికపై ఓ ముసలోడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన విశాఖలో చోటుచేసుకుంది.

Also Read కరోనా ఎఫెక్ట్: ఏపీలో జైళ్ల నుండి 259 మంది ఖైదీల విడుదల...

పూర్తి వివరాల్లోకి వెళితే...హుకుంపేట మండలం కొట్నాపల్లి పంచాయతీ గొందివలసకి చెందిన గెడ్డంగి కొండబాబు (60) ఇంటి పక్కనే ఉండే బాలిక(4)ను మిఠాయి కొనిస్తానని నమ్మించి శుక్రవారం బయటకు తీసుకెళ్లాడు. ఇంటి వెనుకాలే ఉండే చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

కూతురు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతుకుతున్న తల్లికి బాలిక ఏడుపు వినిపించింది. దీంతో ఆమె అటువైపునకు వెళ్లి చూడగా రక్తస్రావంతో కూతురు కనిపించింది. విషయం అర్ధం చేసుకున్న తల్లి ఆగ్రహంతో వృద్ధుడిని చితకబాది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది.

పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. చిన్నారిని వైద్య పరీక్ష ల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే