551 మందికి పాజిటివ్: ఏపీలో 8,72,839 చేరిన కేసులు

Siva Kodati |  
Published : Dec 08, 2020, 05:05 PM IST
551 మందికి పాజిటివ్: ఏపీలో 8,72,839 చేరిన కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 551 కోవిడ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8,72,839కి చేరింది.

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 551 కోవిడ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8,72,839కి చేరింది.

నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా నలుగురు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 7,042కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,429కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 744 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

దీంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,60,368కి చేరింది. నిన్న ఒక్కరోజే 56,187 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు టెస్టుల సంఖ్య 1,05,09,805కి చేరింది.

కరోనా కారణంగా అనంతపురం 8, చిత్తూరు 76, తూర్పుగోదావరి 57, గుంటూరు 89, కడప 18, కృష్ణ 108, కర్నూలు 3, నెల్లూరు 35, ప్రకాశం 18, శ్రీకాకుళం 34, విశాఖపట్నం 36, విజయనగరం 11, పశ్చిమ గోదావరిలలో 58 కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వల్ల గుంటూరు, కృష్ణ, నెల్లూరు, పశ్చిమ గోదావరిలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. 

PREV
click me!

Recommended Stories

Bird’s Paradise Lake: ప్రపంచంలో ఎన్నో సరస్సులు ఉన్నా కొల్లేరు మాత్రం చాలా ప్రత్యేకం.. ఎందుకంటే?
ఇంద్రకీలాద్రి అమ్మవారి పూజ ప్రత్యక్ష ప్రచారం | Vijayawada Kanakadurga Temple | Asianet Telugu