తిరుమలలో కిడ్నాప్ కలకలం.. ఐదేళ్ల బాలుడిని అపహరించిన మహిళ..

Published : May 02, 2022, 10:29 AM ISTUpdated : May 02, 2022, 11:41 AM IST
తిరుమలలో కిడ్నాప్ కలకలం.. ఐదేళ్ల బాలుడిని అపహరించిన మహిళ..

సారాంశం

ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమలలో కిడ్నాప్ కలకలం రేపుతోంది. తిరుపతికి చెందిన ఐదేళ్ల బాలుడిని గుర్తుతెలియని మహిళ అపహరించింది. ఈ ఘటనపై బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.   

ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమలలో కిడ్నాప్ కలకలం రేపుతోంది. తిరుపతికి చెందిన ఐదేళ్ల బాలుడిని గుర్తుతెలియని మహిళ అపహరించింది. వివరాలు.. తిరుపతి సమీపంలోని దామినేడుకు చెందిన మహిళ తిరుమలలో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తుంది.ఆమె కొడుకు ఐదేళ్ల గోవర్దన్ రాయల్ శ్రీవారి ఆలయం ఎదుట కూర్చొని ఉండగా ఆదివారం కిడ్నాప్‌కు గురయ్యాడు. అయితే బాలుడి ఆచూకీ లభించకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించారు. ఎలాంటి ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. 

సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. బాలుడిని ఓ మహిళ కిడ్నాప్ చేసినట్టుగా గుర్తించారు. ఆ మహిళ బాలుడిని కిడ్నాప్ చేసిన తర్వాత ఆర్టీసీ బస్సులో తిరుపతికి చేరుకున్నట్టుగా గుర్తించారు. 03 జెడ్ 0300 నెంబర్ కలిగిన ఆర్టీసీ బస్సులో ఆమె తిరుపతి చేరుకుందని కనుగొన్నారు. అక్కడి నుంచి ఆమె ఎక్కడికి వెళ్లిందో  గుర్తించే పనిలో పడ్డారు. బాలుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు