కాకినాడలో దారుణం: నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం

Published : Nov 25, 2020, 11:15 AM IST
కాకినాడలో దారుణం: నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో దారుణ సంఘటన జరిగింది. మంచంపై నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లి ఓ కామాంధుడు ఆమెపై అత్యాచారం చేశాడు.

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి అమానుషమైన చర్యకు పాల్పడ్డాడు. ఇంట్లో నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లి ఆమెపై ఆగంతకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

అర్థరాత్రి మెలుకువ వచ్చి చూసేసరికి మంచంపై బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు అన్వేషణ ప్రారంభించారు. చివరకు బాలిక ఊరి చివర దేవాలయం వద్ద కనిపించింది. ఒంటిపై దుస్తులు లేవు, శరీరంపై గాయాలు కనిపించాయి.

వెంటనే బాలికను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు చెప్పకుండా వైద్యుులు చికిత్స అందించడానికి నిరాకరించారు. దీంతో వైద్యులపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?