చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం

Siva Kodati |  
Published : Jun 07, 2019, 07:33 AM ISTUpdated : Jun 07, 2019, 09:19 AM IST
చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం

సారాంశం

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. గుంటూరుకు చెందిన ఓ కుటుంబం కారులో తిరుమలకు వెళ్తుండగా రేణిగుంట మండలం గురవరాజుపల్లి దగ్గర ఆగివున్నలారీని వీరి వాహనం ఢీకొట్టింది

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. గుంటూరుకు చెందిన ఓ కుటుంబం కారులో తిరుమలకు వెళ్తుండగా రేణిగుంట మండలం గురవరాజుపల్లి దగ్గర ఆగివున్నలారీని వీరి వాహనం ఢీకొట్టింది.

ఈఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రగాయాలైన ఐదుగురిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : సంక్రాంతి సెలవులు మరో రెండ్రోజులు పొడిగిస్తారా..?
IMD Weather Update : కనుమ రోజు కనువిందు చేసే వెదర్.. తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం