కరోనా మరణాల్లో ఏపీకి ఊరట: 24 గంటల్లో 36 మంది మృతి, తూ.గోలో భయపెడుతున్న కేసులు

Siva Kodati |  
Published : Jun 23, 2021, 05:57 PM IST
కరోనా మరణాల్లో ఏపీకి ఊరట: 24 గంటల్లో 36 మంది మృతి, తూ.గోలో భయపెడుతున్న కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లుగా కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 4,684 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 18,59,141కి చేరుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లుగా కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 4,684 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 18,59,141కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 36 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 12,452కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి ప్రకాశం 2, అనంతపురం 3, తూర్పుగోదావరి 5, చిత్తూరు 8, గుంటూరు 1, కర్నూలు 2, నెల్లూరు 3, కృష్ణ 5, విశాఖపట్నం 2, శ్రీకాకుళం 3, పశ్చిమ గోదావరి 1, కడపలో ఒక్కరు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 7,324 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 17,95,485కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 80,712 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,13,61,014కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 51,204 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 236, చిత్తూరు 493, తూర్పుగోదావరి 1171, గుంటూరు 289, కడప 296, కృష్ణ 355, కర్నూలు 73, నెల్లూరు 306, ప్రకాశం 307, శ్రీకాకుళం 174, విశాఖపట్నం 173, విజయనగరం 151, పశ్చిమ గోదావరిలలో 660 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan Visits Kakinada GGH Firecracker Blast Victims | Asianet News Telugu
Chitha Vijay Prathap Reddy: అంగన్వాడీ అంటే ఇలా ఉండాలి: ఫుడ్ కమిషన్ ఛైర్మన్ ప్రశంసలు | Asianet Telugu