చిత్తూరులో అత్యధికం.. కర్నూలులో అత్యల్పం: ఏపీలో 8,79,339కి చేరిన కేసులు

Siva Kodati |  
Published : Dec 22, 2020, 07:24 PM ISTUpdated : Dec 22, 2020, 11:11 PM IST
చిత్తూరులో అత్యధికం.. కర్నూలులో అత్యల్పం: ఏపీలో 8,79,339కి చేరిన కేసులు

సారాంశం

ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 402 మందికి కోవిడ్ సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 8,79,339కి చేరింది

ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 402 మందికి కోవిడ్ సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 8,79,339కి చేరింది.

నిన్న ఒక్కరోజే కోవిడ్ కారణంగా నలుగురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 7,082కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో 3,978కి చేరింది. గడిచిన 24 గంటల్లో 412 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.

దీంతో రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,68,279కి చేరింది. నిన్న ఒక్కరోజే 56,425 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో మొత్తం టెస్టుల సంఖ్య 1,13,57,530కి చేరుకుంది.

అనంతపురం 19, చిత్తూరు 86, తూర్పుగోదావరి 38, గుంటూరు 32, కడప 25, కృష్ణ 72, కర్నూలు 5, నెల్లూరు 16, ప్రకాశం 18, శ్రీకాకుళం 14, విశాఖపట్నం 35, విజయనగరం 8, పశ్చిమ గోదావరిలలో 34 కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వల్ల కృష్ణలో ఇద్దరు, గుంటూరు, కడప జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. 

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu