ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,967 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 7,75,470కు చేరుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,967 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 7,75,470కు చేరుకున్నాయి.
నిన్న ఒక్కరోజే 25 మంది ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల మృతి చెందిన వారి సంఖ్య 6,382కు చేరుకుంది. గత 24 గంటల్లో 5,010 మంది కరోనా మహమ్మారిని పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో డిశ్చార్జ్‌ల సంఖ్య 7,30,109కి చేరింది.
undefined
ప్రస్తుతం 38,979 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 74,337 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. మొత్తం టెస్టుల సంఖ్య 69,20,377కి చేరింది.
అనంతపురం 233, చిత్తూరు 510, తూర్పు గోదావరి 608, గుంటూరు 246, కడప 212, కృష్ణ 456, కర్నూలు 100, నెల్లూరు 220, ప్రకాశం 355, శ్రీకాకుళం 108, విశాఖపట్నం 206, విజయనగరం 86, పశ్చిమ గోదావరిలలో 627 కేసులు నమోదయ్యాయి.
నిన్న ఒక్కరోజే చిత్తూరు 5, కడప 4, కృష్ణ 4, గుంటూరు 3, ప్రకాశం 3, తూర్పుగోదావరి 2, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరిలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
: 16/10/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 7,72,575 పాజిటివ్ కేసు లకు గాను
*7,27,214 మంది డిశ్చార్జ్ కాగా
*6,382 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 38,979 pic.twitter.com/cpbatkTmRZ