చిత్తూరులో అత్యథికం.. కర్నూలులో అత్యల్పం: ఏపీలో 8,82,286కి చేరిన కేసులు

Siva Kodati |  
Published : Dec 31, 2020, 06:02 PM IST
చిత్తూరులో అత్యథికం.. కర్నూలులో అత్యల్పం: ఏపీలో 8,82,286కి చేరిన కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 338 కేసులు నమోదయ్యాయి. దీంతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,82,286కి చేరుకుంది. నిన్న ఒక్కరోజే కోవిడ్ కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 338 కేసులు నమోదయ్యాయి. దీంతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,82,286కి చేరుకుంది. నిన్న ఒక్కరోజే కోవిడ్ కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 3,262 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 328 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో కలిపి ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,71,916కి చేరింది.

నిన్న 61,148 మందికి టెస్టులు చేయడంతో మొత్తం పరీక్షల సంఖ్య 1,18,25,566కి చేరుకుంది. అనంతపురం 16, చిత్తూరు 65, తూర్పుగోదావరి 42, గుంటూరు 38, కడప 20, కృష్ణ 44, కర్నూలు 6, నెల్లూరు 18, ప్రకాశం 15, శ్రీకాకుళం 13, విశాఖపట్నం 34, విజయనగరం 8, పశ్చిమ గోదావరిలలో 19 కేసులు నమోదయ్యాయి.

కోవిడ్ కారణంగా గుంటూరు, వైఎస్సార్ కడప, విశాఖపట్నం, పశ్చిమ గోదావరిలలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. 

PREV
click me!

Recommended Stories

రూ. 15వేల కోట్ల పెట్టుబ‌డి, 45 వేల‌కిపై ఉద్యోగాలు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో దిగ్గజ సంస్థ
Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet Telugu