గెయిల్‌తో కలిసి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఏర్పాటు: వాణిజ్య ఉత్సవ్‌లో సీఎం జగన్

By narsimha lode  |  First Published Sep 21, 2021, 12:28 PM IST

దేశ ఎగుమతుల్లో రాష్ట్రం వాటా 10 శాతం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఇవాళ విజయవాడలో వాణిజ్య ఉత్సవ్ ను సీఎం జగన్ ప్రారంభించారు. 2030 నాటికి 33.7 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని సీఎం చెప్పారు.



విజయవాడ:దేశగెయిల్ తో కలిసి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.దేశ ఎగుమతుల్లో రాష్ట్రం వాటా 10 శాతం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టుగా ఆయన తెలిపారు.ఆంధ్రప్రదేశ్ వాణిజ్య ఉత్సవం -2021 కార్యక్రమాన్ని ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (ys jagan)మంగళవారం నాడు విజయవాడలో ప్రారంభించారు. 2023 నాటికి భావనపాడు, మచిలీపట్టణం, రామాయపట్నం పోర్టులు అందుబాటులోకి తీసుకువస్తామని జగన్ చెప్పారు. 3 వేల మిలియన్ టన్నుల సామర్ధ్యంతో రూ. 500 కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు

also read:విజయవాడలో వాణిజ్య ఉత్సవాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్

Latest Videos

undefined

గెయిల్ తో కలిసి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్దికి 25 ప్రపంచస్థాయి కాలేజీలను ఏర్పాటు చేస్తామన్నారు సీఎం జగన్.పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం జగన్ చెప్పారు. కొప్పర్తిలో 3,155 ఎకరాల్లో వైఎస్ఆర్ జగనన్న మెగాఇండస్ట్రియల్ హబ్ ను ప్రారంభించనున్నట్టుగా సీఎం చెప్పారు.

రూ. 730 కోట్ల పెట్టుబడితో 801 ఎకరాల్లో వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్స్ మాన్యూపాక్చరింగ్ క్లస్టర్  ఏర్పాటు చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు.  రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మూడు గ్రీన్‌ఫీల్డ్ పోర్టులను రూ. 13 వేల కోట్ల పెట్టుబడితో ప్రారంభిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. 


 

click me!