కొత్తగా 326 కేసులు.. సున్నా మరణాలు: ఏపీలో 8,82,612కి చేరిన సంఖ్య

Siva Kodati |  
Published : Jan 01, 2021, 07:04 PM ISTUpdated : Jan 01, 2021, 11:04 PM IST
కొత్తగా 326 కేసులు.. సున్నా మరణాలు: ఏపీలో 8,82,612కి చేరిన సంఖ్య

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 326 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,82,612కి చేరుకుంది. 

కరోనా కారణంగా నిన్న కొత్తగా ఏ ఒక్కరూ మరణించలేదు. గత 24 గంటల్లో 350 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్‌ల సంఖ్య 8,72,266కి చేరింది.

ప్రస్తుతం ఏపీలో 3,238 యాక్టివ్ కేసులు వున్నాయి. గడిచిన 24 గంటల్లో 58,519 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించడంతో ఇప్పటి వరకు మొత్తం టెస్టుల సంఖ్య 1,18,84,085కి చేరింది.

అనంతపురం 24, చిత్తూరు 44, తూర్పు గోదావరి 45, గుంటూరు 41, కడప 16, కృష్ణ 53, కర్నూలు 10, నెల్లూరు 12, ప్రకాశం 7, శ్రీకాకుళం 8, విశాఖపట్నం 39, విజయనగరం 8, పశ్చిమ గోదావరిలలో 19 కేసులు నమోదయ్యాయి. 

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?