ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: 24 గంటల్లో 320 మందికి పాజిటివ్.. చిత్తూరులో అత్యధికం

Siva Kodati |  
Published : Nov 07, 2021, 06:59 PM IST
ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: 24 గంటల్లో 320 మందికి పాజిటివ్.. చిత్తూరులో అత్యధికం

సారాంశం

ఏపీలో కొత్తగా 320 కరోనా కేసులు (corona cases in ap) నమోదవ్వగా.. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 425 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 3,458 మంది చికిత్స పొందుతున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌‌‌లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. (corona cases in ap) గడిచిన 24 గంటల్లో 320 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,65,346కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,397కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల గుంటూరులో 2, కృష్ణ, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాలో ఒక్కొక్కరు మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 425 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,47,91కు చేరింది. గత 24 గంటల వ్యవధిలో 38,768 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,97,45,537కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 3,458 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 4, చిత్తూరు 67, తూర్పుగోదావరి 31, గుంటూరు 32, కడప 14, కృష్ణ 41, కర్నూలు 5, నెల్లూరు 18, ప్రకాశం 13, శ్రీకాకుళం 15, విశాఖపట్నం 36, విజయనగరం 5, పశ్చిమ గోదావరిలలో 39 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

క్షమాపణలు చెప్పిన టీడీపీ ఆర్టిస్ట్ సునీల్! | YS Bharati Video Controversy | TDP Sunil Apology
ఆ నీచానికి ఒడిగట్టింది మీరే | Perni Nani Fires On Chandrababu | Asianet Telugu