భార్య, ఐదు నెలల కుమార్తె అనుమానాస్పద మృతి.. ఉరికి వేలాడుతూ భర్త, నెల్లూరు జిల్లాలో దారుణం

Siva Kodati |  
Published : Aug 07, 2022, 04:24 PM IST
భార్య, ఐదు నెలల కుమార్తె అనుమానాస్పద మృతి.. ఉరికి వేలాడుతూ భర్త, నెల్లూరు జిల్లాలో దారుణం

సారాంశం

నెల్లూరు జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనుమానాస్పద మరణాల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వివరాల్లోకి వెళితే... అల్లూరు మండలం ఇసుకపల్లిపాలెం గ్రామానికి చెందిన మురళికి స్వాతితో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. వీరికి ఐదు నెలల కుమార్తె వుంది. అయితే డెలివరి కోసం పుట్టింటికి వెళ్లిన స్వాతి ఇటీవలే పుట్టింటి నుంచి అత్తగారింటికి వచ్చింది. ఈ నేపథ్యంలో భార్య, కుమార్తె ఆదివారం అనుమానాస్పద స్థితిలో శవాలుగా తేలారు. 

అయితే మురళీయే వారిద్దరిని గొంతు నులిమి చంపినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో మురళి మరో గదిలో ఉరికి వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనుమానాస్పద మరణాల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఐదు నెలల పసిబిడ్డ సహా ముగ్గురి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం