ఏపీలో కొత్తగా 2,949 మందికి కరోనా : 8.14 లక్షలకు చేరిన కేసులు

Siva Kodati |  
Published : Oct 28, 2020, 07:22 PM IST
ఏపీలో కొత్తగా 2,949 మందికి కరోనా : 8.14 లక్షలకు చేరిన కేసులు

సారాంశం

గడిచిన 24 గంటల్లో 77,028 శాంపిల్స్‌ను పరీక్షించగా 2,949 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,14,774కి చేరింది. 

గడిచిన 24 గంటల్లో 77,028 శాంపిల్స్‌ను పరీక్షించగా 2,949 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,14,774కి చేరింది.

అలాగే రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాలు స్వల్పంగా తగ్గాయి. బుధవారం కరోనా బారినపడి 18 మంది మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల మృతి చెందిన వారి సంఖ్య 6,643కు చేరుకుంది.

కరోనా మహమ్మారి బారిన పడి గడిచిన 24 గంటల్లో అనంతపురం జిల్లాలో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, తూర్పు గోదావరిలో ఇద్దరు, ప్రకాశంలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు మృత్యువాత పడ్డారు.

3,609 మంది కరోనా మహమ్మారిని పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం 8,14,774 పాజిటివ్ కేసులకు గాను.. 7,81,509 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 26,622 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

నిన్న చేసిన వాటితో కలిపి ఏపీలో కరోనా టెస్టుల సంఖ్య 77,73,681కి చేరింది. 24 గంటల్లో అనంతపురం 192, చిత్తూరు 315, తూర్పు గోదావరి 417, గుంటూరు 421, కడప 193, కృష్ణ 457, కర్నూలు 32, నెల్లూరు 76, ప్రకాశం 99, శ్రీకాకుళం 74, విశాఖపట్నం 114, విజయనగరం 67, పశ్చిమ గోదావరిలలో 492 కేసులు నమోదయ్యాయి. 

 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం