కొత్తగా 253 మందికి పాజిటివ్, గుంటూరులో తీవ్రత: ఏపీలో 8,92,522కి చేరిన కేసులు

Siva Kodati |  
Published : Mar 17, 2021, 09:32 PM IST
కొత్తగా 253 మందికి పాజిటివ్, గుంటూరులో తీవ్రత: ఏపీలో 8,92,522కి చేరిన కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల్లో పెరుగుదల నిలకడగానే వుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 253 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీనితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 8,92,522కి చేరుకుంది.

కరోనా వల్ల నిన్న గుంటూరులో ఒకరు మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు కోవిడ్ సోకి ప్రాణాలు  కోల్పోయిన వారి సంఖ్య 7,186కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,694 మంది చికిత్స పొందుతున్నారు.

గడిచిన 24 గంటల్లో కోవిడ్ నుంచి 137 మంది పూర్తిగా కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,83,642కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు 30,716 మందికి కరోనా టెస్టులు చేయడంతో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం నిర్థారణా పరీక్షల సంఖ్య 1,46,11,499కి చేరింది.

గత 24 గంటల్లో అనంతపురం 15, చిత్తూరు 39, తూర్పుగోదావరి 29, గుంటూరు 69, కడప 7, కృష్ణా 11, కర్నూలు 26, నెల్లూరు 5, ప్రకాశం 7, శ్రీకాకుళం 10, విశాఖపట్నం 27, విజయనగరం 4, పశ్చిమ గోదావరిలలో 4 కేసులు చొప్పున నమోదయ్యాయి. 

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?